డీఫెరెంట్ గా తీసిన చిన్న సినిమాలు ఊహించని ఘనవిజయం సాధిస్తూ ఉండటంతో చిన్న సినిమాలను తీసే దర్శకులు నిర్మాతలు డిఫరెంట్ గా ఉండే చిన్న సినిమాలను తీయాలని చాలప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నాలలో భాగంగానే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘మార్కెట్ మహాలక్ష్మి’ లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారడంతో ఈ మూవీ పై అంచనాలు బాగా పెరిగిపోతున్నాయి.మార్కెట్ లో కూరగాయలు అమ్ముకునే అమ్మాయిని ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి ప్రేమిస్తే ఎలా ఉంటుంది అన్న పాయింట్ చుట్టూ ఈమూవీ కథ ఉంటుందని సమాచారం. సినిమా మొత్తం కామెడీగా ఉంటూ ఒక సున్నితమైన ప్రేమకథ అంతర్లీనంగా ఈమూవీ కథలో దర్శకుడు చెపుతాడని అంటున్నారు. కేరింత లాంటి యూత్ ఫుల్ మూవీస్ తో పేరు తెచ్చుకున్న పార్వతీశం హీరోగా నటిస్తుండగా టైటిల్ రోల్ లో  ప్రణికాన్వికా పోషిస్తోంది. బి2పి స్టూడియోస్ బ్యానర్ పై అఖిలేష్ కిలారు ఈమూవీని నిర్మించారు.ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో ఈసినిమాను విడుదల చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈమధ్య కాలంలో కాయగూరలు అమ్మే అమ్మాయిలు కూరల వ్యాపారం చేసే మహిళలు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అవుతున్నారు. ఇప్పుడు కూరల దుకాణ నేపద్యంలో ఒక లవ్ స్టోరీ అంటే డిఫరెంట్ గా ఉంటుందని ఈ ప్రయత్నం దర్శకుడు చేస్తున్నాడు అనుకోవాలి.ఈమధ్య కాలంలో తెలంగాణ యాస తో ఉన్న సినిమాలను ప్రేక్షకులు బాగా చూస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణ యాస పట్ల కోస్తా జిల్లాలలో క్రేజ్ కూడ బాగా పెరిగింది. తెలుగు మాట్లాడే ప్రజలు రెండు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా సినిమాలను ఆదరించడంలో తెలుగు వారు అంతా ఒక్కటిగానే ఉంటున్నారు. గత సంవత్సరం రిలీజ్ అయిన ‘బలగం’ ఎలాంటి సక్సస్ ను అందుకుందో అలాంటి ఊహించని సక్సస్ ను ఈ సినిమా కూడ అందుకుంటుందేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: