వరస ఫ్లాప్ లతో సతమతమైపోయిన నాగార్జున కు ‘నా సామి రంగ’ మళ్ళీ నూతన ఉత్సాహాన్ని ఇచ్చింది. దీనితో రెట్టించిన ఉత్సాహంతో వరసపెట్టి తాను చేయబోయే మూవీ ప్రాజెక్ట్స్ కు నాగ్ లైన్ క్లియర్ చేస్తున్నాడు. తన సంక్రాంతి సెంటిమెంట్ ను కొనసాగించాలని నాగ్ వచ్చే సంక్రాంతి రేస్ లో నిలబెట్టబోయే తన మూవీ స్క్రిప్ట్ గురించి ఇప్పటికే చాల సీరియస్ గా ఆలోచన చేస్తున్నాడు.ఈమూవీలో నటిస్తూనే త్వరలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ప్రారంభం కాబోతున్న మూవీలో కీలక పాత్రను చేయబోతున్న సందర్భంలో ఆమూవీలోని తన పాత్ర విషయమై శేఖర్ కమ్ములతో ఆలోచనలు చేస్తున్నాడు. ఈమూవీలో వాస్తవానికి ధనుష్ హీరో అయినప్పటికీ హీరోతో సమానమైన పాత్రను శేఖర్ కమ్ముల నాగ్ కోసం డిజైన్ చేసినట్లు టాక్. ఈ రెండు సినిమాలు పూర్తి చేయడంతో నాగార్జున తన  మైల్ స్టోన్ మూవీ తన 100వ సినిమా పై దృష్టి సారించబోతున్నట్లు తెలుస్తోంది.వాస్తవానికి ఈసినిమాను నాగ్ పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో తీయాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట్లో ఈమూవీ ప్రాజెక్ట్ ను దర్శకుడు మోహన్ రాజాకు అప్పగించాలని భావించినప్పటికీ ఇప్పుడు నాగార్జున ఆలోచనలు మారిపోవడంతో ఈ 100వ మూవీ ప్రాజెక్ట్ విషయంలో కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ నవీన్ తో ఈమూవీ కథావిషయమై చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది,ఈమూవీని ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా తో భాగశ్వామిగా  అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించడానికి నాగ్ ప్రాధమిక ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అనుకున్నవీ అనుకున్నట్లు  జరిగితే ఈమూవీ షూటింగ్ వచ్చే సంవత్సరం జనవరి తరువాత ప్రారంభం అయి అదే సంవత్సరం చివరిలో నాగార్జున తన 100వ సినిమా విడుదల ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. సీనియర్ హీరోలు చిరంజీవి తన 150వ సినిమా బాలకృష్ణ 100వ సినిమా రికార్డులు క్రియేట్ చేసిన నేపద్యంలో నాగ్ 100వ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి..    

మరింత సమాచారం తెలుసుకోండి: