టాలీవుడ్ లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న వారిలో విజయ్ దేవరకొండ కూడా ఒకరు.. అర్జున్ రెడ్డి,గీత గోవిందం సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు హీరో విజయ్ దేవరకొండ... ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించారు. ఇప్పుడు తాజాగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టొరీ తో డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో మరొక సినిమాలో నటిస్తున్నారు విజయ్ దేవరకొండ.. ఈ సినిమాకి టైటిల్ ది ఫ్యామిలీ స్టార్.. గతంలో పోస్టర్స్, గ్లింప్స్ విడుదల చేయగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. ఇప్పుడు తాజాగా ఒక చిన్న టీజర్ తో ప్రేక్షకులను మళ్ళీ ఆకట్టుకుంటున్నారు.ఇందులోని కొన్ని సన్నివేశాలు అన్నీ కలిపి ఒకే షాట్ లో చూపించారు.ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిలో కనిపించే బాధ్యతలతో పాటు హీరోయిన్ చూపించేలా ఉండడమే కాకుండా మాస్ సన్నివేశాలను కూడా చూపించినట్లు కనిపిస్తోంది.. ది ఫ్యామిలీ స్టార్ టీజర్ నిన్నటి రోజున సాయంత్రం 6 గంటలకు రిలీజ్ అన్నట్లుగా ప్రకటించారు కానీ ఆ సమయానికి పోస్ట్ పోన్ అవ్వడంతో ఎనిమిది గంటలకు రిలీజ్ చేస్తామంటూ వెల్లడించారు కానీ చివరికి తొమ్మిది గంటలకు టీజర్ రిలీజ్ చేశారట..


ఇక ఈ ఆలస్యంతో ఫ్యాన్స్ అటు మృణాల్ ఠాకూర్ కూడా చాలా అలసిపోయి విజయ్ నీ ట్యాగ్ చేస్తూ  ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఏవండీ ఇంకెంత సేపండి టీజర్ అంటూ ట్వీట్ చేసింది ఈ ముద్దుగుమ్మ.. ఇక ఈ క్విడ్ కి సైతం విజయ్ రిప్లై ఇస్తూ సారీ తల్లి వచ్చేస్తోంది ఇంకొన్ని నిమిషాలలో టీజర్ అప్లోడ్ అవుతోంది అంటూ రిప్లై ఇచ్చారు కానీ ఈసారి నా గ్యారెంటీ అంటూ ట్వీట్ చేశారు.. ప్రస్తుతం అందుకు సంబంధించి టీజర్ కూడా వైరల్ గా మారడంతో పాటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. అభిమానులైతే ఈసారి కచ్చితంగా విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ హిట్టు కొడతాడు అంటూ తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: