ఇక ఈ షో ద్వారా వచ్చిన మొత్తంతో నిహారికా ప్రొడక్షన్ బ్యానర్‌ని ప్రారంభించింది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరుతో ప్రొడక్షన్ ప్రారంభించి ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్ సిరీస్‌ని నిర్మించింది. ఇందులో యాక్ట్ చేసింది కూడా. ఆ వెబ్ సిరీస్ బాగా ఆదరణ పొందింది. తెలుగులో మంచి ప్రశంసలు అందుకుంది. అలాగే నిహారిక తనకు వచ్చిన పారితోషికంతో అమ్మా నాన్నలకు గిఫ్ట్ లు ఇచ్చిందట. నాన్ననాగబాబుకి వెంటనే ఒక హెడ్ ఫోన్ కోనిచ్చిందట. తమకి ఇంట్లో ఒక్కటే టీవీ ఉండేదట. నాన్న ఎప్పుడూ అందులోనే పాటలు పెట్టుకుని వింటుండేవాడు, తమకి టీవీ చూసే అవకాశం వచ్చేది కాదు. దీంతో హెడ్ ఫోన్ కోనిస్తే ఫోన్ లో పాటలు వింటూ రిలాక్స్ అయ్యేవాడని, అమ్మ నేను ఎంచక్క టీవీ చూసుకునేవాళ్లమని తెలిపింది నిహారిక. తనకి ముక్కు పుడక అంటే చాలా ఇష్టం. అందుకే అమ్మకి గోల్డ్ ముక్కుపుడక గిఫ్ట్ గా ఇచ్చినట్టు తెలిపింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి