కొన్ని సీజన్ లలో సినిమాలు భారీగా విడుదల అవుతూ ఉంటాయి. ఇక ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ చివర నుండి అక్టోబర్ నెల ఆఖరి వరకు అనేక క్రేజీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. అవి ఏవో తెలుసుకుందాం.

ఈ సంవత్సరం సెప్టెంబర్ 27 వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా రూపొందిన "ఓజి" మూవీ విడుదల కానుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఈ సినిమా తర్వాత అక్టోబర్ 10 వ తేదీన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా రూపొందిన దేవర సినిమా విడుదల కానుంది. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ సినిమాపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇదే తేదీన కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి సూర్య హీరో గా రూపొందిన కంగువ సినిమా కూడా విడుదల కానుంది. 

మూవీ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అక్టోబర్ 11 వ తేదీన టాలీవుడ్ యువ నటుడు నాగ చైతన్య హీరో గా రూపొందిన తండేల్ మూవీ విడుదల అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం గేమ్ చేంజర్ మూవీ రూపొందుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది.  
 ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీ కాంత్వ్... టీ జే జ్ఞానవేలు దర్శకత్వంలో రూపొందుతున్న వెట్టయన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని అక్టోబర్ 31 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మూవీ బృందం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ని అక్టోబర్ నెలలో విడుదల చేయనున్నట్లు  ఈ చిత్ర బృందం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: