మలయాళ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి మమ్ముట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు . ఈయన వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈయన నటించిన చాలా సినిమాలు ఈ మధ్య కాలం లో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ లను అందుకున్నాయి .  ప్రస్తుతం మముట్టి "టర్బో" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. 

ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా కాలం అవుతుంది . మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి కాబోతున్నట్లు సమాచారం. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం జూన్ 13క్వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు.

ఈ చిత్ర బృందం తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో మమ్ముట్టి వైట్ కలర్ లో ఉన్న షర్టును వేసుకొని ... వైట్ కలర్ లో ఉన్న  పంచే ను కట్టుకొని జీప్ పై స్టైలిష్ లుక్ లో కూర్చొని ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది.  వైషాక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు సునీల్ కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న మమ్ముట్టి హీరోగా రూపొందుతున్న సినిమా కావడంతో ఈ మూవీ పై మలయాళ సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: