పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్ల నుంచి వరుస ఫ్లాప్ లతో సతమతమైన ప్రభాస్ సలార్ అనే సినిమాతో ఒక సాలిడ్ హిట్టు కొట్టాడు. ఇక ఇప్పుడు ప్రభాస్ నటించిన మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరీ ముఖ్యంగా అటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్లో తెరకెక్కుతున్న కల్కి మూవీ పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులందరికీ కూడా ఆకట్టుకుంది  


 ఇక ఈ మూవీలోని ఒక్కో పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ ని అటు చిత్రబృందం విడుదల చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ఈ మూవీకి సంబంధించి ఒక స్పెషల్ వీడియోని మేకర్స్ రిలీజ్ చేశారు. కల్కి 2898 ఏడి సినిమాలో అమితాబచ్చన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఆయన పాత్రకు సంబంధించిన లుక్ ని ఇటీవల చిత్ర బృందం విడుదల చేశారు. ఈ క్రమంలోనే ఈ స్పెషల్  వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. కాగా అశ్వద్ధామ పాత్రలో అమితాబ్ కనిపించబోతున్నట్లు ఇక ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ని ఒక లెవెల్లో హైలెట్ చేసి చూపించారు అని చెప్పాలి. కాగా నిన్న మొన్నటి వరకు కల్కి సినిమా పేరు వినిపిస్తే చాలు ప్రభాస్ మాత్రమే ఊహల్లో కనిపించేవాడు. కానీ ఇప్పుడు తాజా పోస్టర్తో అమితాబచ్చన్ కనిపించడం మొదలుపెట్టాడు. ఒకరకంగా చెప్పాలంటే అటు అమితాబచ్చన్ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ తో ప్రభాస్ కాస్త వెనుకబడిపోయాడు. దీంతో రెబల్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సినిమాలో ప్రభాస్ లుక్ కంటే అమితాబచ్చన్ లుక్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసినట్లు ఉన్నాడు నాగ్ అశ్విన్. ఈ విషయంలో తప్పు చేశాడు ఏమో. ఇక ఇదే నిజమైతే ప్రభాస్ అభిమానుల నుంచి నాగ్ అశ్విన్ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విషయంపై ఒకసారి ఆలోచిస్తే మంచిది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: