ఒకప్పుడు టాలీవుడ్ లో మాత్రమే రెబల్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకొని ప్రేక్షకులను అలరించిన ప్రభాస్.. ఇక ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్ వాంటెడ్ హీరోగా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయాన్ని తెలిసిందే. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. అయితే ఆ తర్వాత ప్రభాస్ నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోయినప్పటికీ ఇక బాలీవుడ్ లో మాత్రం ఈ రెబల్ స్టార్ క్రేజ్ ని అమాంతం పెంచేసాయి. అయితే మొన్నటికి మొన్న ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమాతో అటు ప్రభాస్ ఎంత పెద్ద హిట్ కొట్టాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 దాదాపు ఆరేళ్ల క్యాబ్ తర్వాత ఒక బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు ప్రభాస్. సలార్ మూవీని రెండు పార్ట్ లుగా తెరకెక్కించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే మొదటి పార్ట్ విడుదలై అభిమానులు అందరిలో కూడా రెండో పార్ట్ పై అంచనాలను పెంచేసింది. ఇక సలార్ 2లో నటీనటులుగా ఎవరు ఉండబోతున్నారు అన్నది తెలుసుకునేందుకు కూడా ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 ఏకంగా సలార్ 2 సినిమాలో నాచురల్ స్టార్ నాని మూవీ నటుడు విలన్ పాత్రలో నటించబోతున్నారట. నాని హీరోగా నటించిన దసరా సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఈ మూవీలో విలక్షణ నటనతో ఆకట్టుకున్న షైన్ టామ్ చాకోను సలార్ 2 లో మరో విలన్ పాత్రకు మేకర్స్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చెప్పిన కథకు సదరు నటుడు ఓకే చెప్పేసాడట. సలార్ ను నేరుగా ఢీకొనేలా చాకో పాత్ర ఉండబోతుంది అని సమాచారం. ఇక త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందట. అయితే సలార్ 2 మూవీ అటు ప్రశాంత్ నీల్ యూనివర్సిటీ మరో మూవీకి కనెక్షన్ ఉంటుంది అని పృథ్వీరాజ్ చెప్పడం ఈ మూవీపై మరింత అంచనాలను పెంచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: