సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లి కాని ప్రసాదులు ఉన్నారు. 40 ఏళ్లు దాటిపోయినా సరే పెళ్లి ఊసే ఎత్తడం లేదు. సినీ జీవితంలో ఎన్నో పెళ్లిళ్లు చేసుకున్న ఈ హీరోలు నిజ జీవితంలో మాత్రం పెళ్లి ప్రసక్తే తీసుకురావడం లేదు.ఎవనైనా ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడిగితే.. తన కంటే ఏజ్ ఎక్కువున్న హీరోలకు కూడా పెళ్లి కాలేదని.. వారు చేసుకున్న తర్వాత చేసుకుంటా అంటున్నారు. తాజాగా హీరో విశాల్ కూడా ఇదే రూటులో వచ్చి చేరాడు.46 ఏళ్ల వయస్సు వచ్చినా సరే హీరో విశాల్ మాత్రం తానింకా చిన్నపిల్లాడిలానే పెళ్లి అనే దానికి దూరంగా ఉంటున్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరో పక్క రాజకీయాల్లోకి రావడానికి కూడా ప్లాన్ చేస్తున్నాడు. అయితే సినీ, రాజకీయ జీవితం గురించి ముందుగానే ప్లాన్స్ చేసుకుంటూ జీవిత భాగస్వామి గురించి మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని నెట్టింట తెగ కామెంట్స్ చేస్తున్నారు. విశాల్ ఎప్పటికీ పెళ్లి ప్రస్థావన తీసుకురాకపోవడంతో జనాలు మీ పెళ్లి ఎప్పుడో చెప్పు అంటూ ప్రశ్నిస్తున్నారు.

తాజాగా విశాల్‌కి ఇలాంటి ఓ ప్రశ్న ఎదురుకాగా తెలివిగా సమాధానం ఇచ్చారు. సల్మాన్ ఖాన్, శింబు, ప్రభాస్.. ఈ ముగ్గురు పెళ్లి చేసుకున్న తర్వాతనే తాను కూడా పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ప్రస్తుతం శింబుకు పెళ్లి చేయడానికి ఆయన పేరెంట్స్ సంబంధాలు చేస్తున్నారు. మరి ప్రభాస్ అయితే తన సినిమాలపై తప్ప పర్సనల్ లైప్ గురించి పెద్దగా పట్టించుకోరు.ఇకపోతే విశాల్ తన ముందున్న వారి లిస్ట్‌లో సల్మాన్ ఖాన్ పేరును ఎందుకు చేర్చాడో అర్థం కావడం లేదు. సల్మాన్ ఖాన్‌కు అసలు పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశమే లేదు. తాను పెళ్లి చేసుకుంటానని సల్మాన్ ఎక్కడా చెప్పిన దాఖలాలు లేవు. దీంతో విశాల్‌కి పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఉందా..? లేదా బ్రహ్మచారిగా మిగిలిపోతాడా? అనే అనుమానం ఫ్యాన్స్‌లో మొదలైంది.హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్‌, విశాల్ మధ్య కొంత కాలం ప్రేమాయణం నడిచింది. ఆ తర్వాత వీరు విడిపోయారు. మళ్లీ కొన్నాళ్లకు తెలుగు అమ్మాయి అనీషా రెడ్డీతో విశాల్ దాదాపు ఆరేళ్ల పాటు ప్రేమాయణం నడిపాడు. అంతా సెట్ అయి నిశ్చితార్థం చేసుకున్న వీరు.. ఆ తర్వాత పెళ్లి చేసుకోకుండానే బంధానికి బ్రేక్ వేశారు. అయితే విశాల్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడానికి వీరే కారణం అని.. నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: