టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ తమ్ముడుగా ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు పవన్ కళ్యాణ్. అంతేకాదు తెలుగు ప్రేక్షకులు అందరికీ కూడా పవర్ స్టార్ గా మారిపోయాడు అని చెప్పాలి. సాధారణంగా సినిమా హీరోలకు వారి నటనను సినిమాలను చూసి ప్రేక్షకులు అభిమానులుగా మారడం చూస్తూ ఉంటాం. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం అలా కాదు. ఎందుకంటే మిగతా హీరోలతో పోల్చి చూస్తే ఆయన చేసింది తక్కువ సినిమాలే అందులో హిట్ అయినవి ఇంకా తక్కువే.


 అయినప్పటికీ ఇండస్ట్రీలో ఏ హీరోకి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సొంతం అని చెప్పాలి. ఇలా తన సినిమాలతో కాదు తన వ్యక్తిత్వంతోనే కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకోగలిగాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో బిజీబిజీగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజీ అనే సినిమాలో నటిస్తున్నాడు.


 ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించి ఫస్ట్ పోస్టర్ విడుదల కాగా ఈ పోస్టర్ అభిమానులు అందరినీ కూడా విశేషంగా ఆకట్టుకుంది. సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచింది అని చెప్పాలి. అయితే ఇక ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ జి సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు ఇదే అంటూ కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతూ ఉండగా.  ఈ విషయంపై దర్శకుడు సుజిత్ క్లారిటీ ఇచ్చాడు. కార్తికేయ నటించిన భజే వాయువేగం ప్రమోషన్స్ లో భాగంగా ఓజి సినిమా విశేషాలను పంచుకున్నాడు డైరెక్టర్ సుజిత్. మొదట పవన్ కళ్యాణ్ తనను రీమేక్ కోసం పిలిచారని.. కొత్త కథ ఏదైనా ఉందా అని అడిగితే ఓజి స్టోరీ చెప్పడంతో అది నచ్చి ఇక ఆ సినిమా చేస్తున్నారని సుచిత్ తెలిపాడు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర పేరు ఓజస్ గంభీర అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: