ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరి కన్ను ఓకే సినిమా పై ఉంది. అదే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 మూవీ పై. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ట్రైలర్ మూవీపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసేసింది. ఏకంగా హాలీవుడ్ రేంజ్ ను మించే విధంగా కల్కి మూవీ ఉండబోతుంది అని అభిమానులు అందరూ కూడా భారీగానే అంచనాలు పెట్టుకుంటున్నారు.


 400 కోట్ల భారీ బడ్జెట్లో తెరకేకుతున్న ఈ సినిమా ఏకంగా 1500 కోట్ల వసూళ్లు రాబడుతుందనే ధీమాతో అటు చిత్ర బృందం కూడా ఉంది అన్నది తెలుస్తోంది   ఇప్పటికే వైవిధ్యమైన సినిమాలు తీసి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ నాగ్ అశ్విన్ కల్కి సినిమాతో ప్రభంజనం సృష్టించాలని అనుకుంటున్నాడట. ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్ లిస్టులో టాప్ లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాడట. అయితే ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి అని చెప్పాలి. కానీ ఒక్క విషయంపై మాత్రం అటు నాగ్ అశ్విని ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వడం లేదు.


 ఈ మధ్యకాలంలో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమాలు అన్నీ కూడా ఏకంగా ఒక పార్ట్ కాకుండా రెండు పార్ట్ లుగా తెరకెక్కించడం చూస్తూ ఉన్నాం. అయితే కల్కి మూవీ రెండు పార్ట్ లు ఉండబోతుందా లేదంటే ఒకటే పార్ట్ ఉంటుందా అనే విషయంపై మాత్రం నాగ్ అశ్విన్ ఇప్పటివరకు ఏ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ ఒక్క విషయం తెలిస్తే బాగుండు అని అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా కల్కి 2898 సినిమా విడుదల తర్వాత క్లైమాక్స్ లో ఇక సీక్వెల్ కు సంబంధించి ఏదైనా ట్విస్ట్ ఇవ్వబోతున్నాడా లేకపోతే ఒకే సినిమాతో ఈ మ్యాజిక్ ని సరిపెట్టుకుంటాడు అన్నది సినిమా విడుదలైన తర్వాతే క్లారిటీ రాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: