టాలీవుడ్ లో అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి.అలాంటి మూవీస్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా కూడా ఒకటి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో మొదటిసారి ఏకంగా మహేష్ బాబు, వెంకటేష్ లాంటి మాస్ యాక్షన్ హీరోలు కలిసిన నటించారు. దీంతో ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాల పెరిగిపోయాయి. ఇక ఇలాంటి అంచనాల మధ్యే సినిమా విడుదలైంది. ఇక సినిమా ఎంత అద్భుతంగా ఉందంటే ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కూర్చొని బంధాలకు అనుబంధాలకు ఉన్న విలువను అర్థం చేసుకొని ఇక ఎంతో సంతృప్తిగా థియేటర్ బయటకి వచ్చేసారు .
ఇక అన్నదమ్ములుగా వెంకటేష్ మహేష్ బాబుల నటన కూడా అద్భుతం అని చెప్పాలీ. శ్రీకాంత్ అడ్డాల టేకింగ్ కూడా బాగుంది. కానీ అభిమానులకు కావాల్సిన మసాలా మాత్రం ఈ సినిమాలో కనిపించలేదు. మాస్ ఫాలోయింగ్ ఉన్న వెంకటేష్, మహేష్ బాబు లని అంతసాఫీ పాత్రల్లో చూడలేకపోయారు అభిమానులు. సినిమాలో పెద్దగా యాక్షన్ ఎలిమెంట్స్ లేకపోవడం.. హీరోయిజం చూపించే సీన్స్ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ తెగ ఫీల్ అయిపోయారు. ఇద్దరు హీరోలు కలిసిన నటిస్తున్నారంటే యాక్షన్ కూడా మరో లెవెల్ లో ఉంటుందని అంచనా వేసి థియేటర్లకు వెళ్లిన ఫ్యాన్స్ కి నిరాశ మిగిలింది. ఇలా ఫ్యామిలీ ఆడియోస్ నుంచి పాజిటివ్ టాక్ వచ్చి.. ఈ సినిమా మంచి హిట్ అయినప్పటికీ.. మహేష్ బాబు వెంకటేష్ రేంజ్ లో మాత్రం కమర్షియల్ గా హిట్ సాధించలేకపోయింది ఈ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ. ఒకరకంగా కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం థియేటర్కు వెళ్లిన అభిమానులను నిరాశపరిచింది అని చెప్పాలి. కాగా 2013 సంవత్సరంలో సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా విడుదలైంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి