స్టార్ హీరోల సినిమాలు విడుదల కావడానికి రెడీ అయ్యాయి అంటే చాలు వారి ఫాన్స్ కూడా ఎంతో జోష్లో ఉంటారు. ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో సినిమా థియేటర్లలో విడుదల అవుతుందా అని ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తారు. ఇక తమ అభిమాన హీరో సినిమా విడుదల దగ్గరికి వచ్చింది అంటే చాలు వారు దానిని ఒక పెద్ద వేడుకల జరుపుకుంటారు. థియేటర్ల వద్ద ఫేక్సీలు కట్టడం , సినిమా విడుదలకు ముందు బాంబులు పేల్చడం , పాలాభిషేకాలు చేయడం ఇలా అనేక రకాలైన హంగామాను సృష్టిస్తూ ఉంటారు. ఇక ఇదంతా సజావుగా జరిగితే ఏ సమస్య లేదు.

కానీ ఇలా సంబరాలు చేస్తున్న సమయంలో కొన్ని విషాదకరమైన సంఘటనలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. అలా కొన్ని సందర్భాలలో విషాదకరమైన సంఘటనలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొంత కాలం క్రితం రెబల్ స్టార్ ప్రభాస్ "రాధేశ్యామ్" అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పూజా హెగ్డే ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా నటించగా ... రాధాకృష్ణమూవీ కి దర్శకత్వం వహించాడు. 2022 వ సంవత్సరం మార్చి 11 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే ఈ సినిమా విడుదల సమయంలో చల్లా కోటేశ్వరరావు అనే వ్యక్తి ఫ్లెక్సీ కడుతూ కరెంటు షాక్ కి గురై మృతి చెందాడు. ఈ విషయం ఆ సమయంలో పెద్ద సన్సేషనల్ అయ్యింది. ఇలా ప్రభాస్ సినిమాకు సంబంధించిన ఫ్లెక్సీ కడుతూ ఓ వ్యక్తి మృతి చెందడం అనేది అత్యంత వైరల్ గా కూడా మారింది. ఇకపోతే కొంతమంది హీరోలను అభిమానించడం తప్పు కాదు. కానీ వారిని అభిమానించే క్రమంలో అత్యుత్సాహాన్ని చూపించి వారి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం ప్రమాదం అని చెబుతూ వస్తున్నారు.

తమ అభిమాన హీరో పై అభిమానాన్ని చూపించ క్రమంలో వారికి ఏమైనా జరిగితే ఆ తర్వాత వారి కుటుంబాలకు అండగా నిలిచేది ఎవరు .? వారి కుటుంబాల గురించి ఆలోచించాలి. ఆ తర్వాతే ఏదైనా. వారి కుటుంబాన్ని పట్టించుకోకుండా కొన్ని విషయాలలో అత్యుత్సాహాన్ని చూపడం వాళ్ళ వారి ప్రాణాలకు ఏమైనా జరిగితే ఆ తర్వాత వారి కుటుంబం వీధిన పడే అవకాశం ఉంటుంది. అందుకే హీరోలను అభిమానించడం తప్పు కాదు. కానీ వారి కోసం అత్యుత్సాహంగా ప్రవర్తించి వారి ప్రాణాల మీదికి తెచ్చుకోవడం ఎంతో ప్రమాదం అనే అభిప్రాయాలను ఆ సమయంలో ఎంతో మంది వినిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: