
ప్రభాస్ ది మొదట్లో గెస్ట్ రోల్ మాతమే అనుకోగా అతని క్రేజ్ ఫాలోయింగ్ చూసి అతను ఇచ్చిన డేట్స్ లోనే ఎక్కువ రష్ తీసుకున్నారట మేకర్స్. దానితో ప్రభాస్ నే మెయిన్ గా చూపిస్తూ ఎక్కువ సీన్స్ షూట్ చేశారట. కన్నప్ప సినిమాలో ప్రభాస్ నందీశ్వరుడిగా నటించాడు.
మంచు విష్ణు లీడ్ రోల్ చేసినా సినిమాలో నటించిన మిగతా స్టార్స్ ఇమేజ్ ని వాడుకోవాలనే మంచు హీరో ఇలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. కన్నప్ప టీజర్ తో విమర్శల పాలైన మంచు విష్ణు ఈమధ్య రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ తో కాస్త బెటర్ అనిపించాడు. మరి కన్నప్ప ని అనుకున్న విధంగా అనుకున్న రేంజ్ లో తీస్తున్నాడా లేదా అన్నది చూడాలి. మంచు విష్ణు మాత్రం సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. కన్నప్ప సినిమా సక్సెస్ అయితే మాత్రం మంచు హీరో పంట పడినట్టే లెక్క. ఐతే స్టార్స్ ని తీసుకోవడం వరకు ఓకే కానీ వారిని ఎలా వాడుకున్నారు అన్నది ఇంపార్టెంట్. ఈ విషయంలో మంచు విష్ణు అండ్ టీం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నది చూడాలి. సినిమా ఏమాత్రం తేడా కొట్టినా మంచు విష్ణుని విపరీతమా ట్రోల్ చేస్తారని చెప్పడంలో సందేహం లేదు.