ఏంటి నజ్రియా నిజంగానే ఆ హీరోతో ఎఫైర్ పెట్టుకుందా.. అందుకే ఫహద్ ఫాజిల్ వదిలేస్తున్నాడా.. ఇంతకీ నజ్రియా ఫహద్ ల విడాకులు మేటర్ లో ఉన్న నిజం ఎంత అనేది ఇప్పుడు చూద్దాం.. ఫహద్ ఫాజిల్ నజ్రియాలని క్యూట్ కపుల్ అంటూ ఉంటారు. వీరిద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉన్నా కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో చాలామంది వీరి ప్రేమని చూసి పెళ్లిని చూసి షాక్ అయిపోయారు.ముఖ్యంగా ఎందుకు మీరు చిన్న ఏజ్ లో పెళ్లి చేసుకున్నారు అని నజ్రియాని ఓ ఇంటర్వ్యూలో ప్రశ్నించినప్పుడు ఫహద్ ఫాజిల్ లాంటి మనిషి మళ్ళీ దొరుకుతారో లేదో అని చిన్నవయసు అయినా సరే నేను ఆయన్ని పెళ్లాడాను. ఆయన అంటే నాకు ఎంతో ఇష్టం అని నజ్రియా చెప్పుకొచ్చింది. అలా వీరి పెళ్ళై దాదాపు 11 సంవత్సరాలు గడిచింది.

 అయితే సడన్గా ఇన్నేళ్ల వీరి సంసార జీవితంలో కలతలు ఏర్పడి ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో నజ్రియా తన భర్తతో కలిసి ఎక్కడ కూడా కనిపించడం లేదు.ముఖ్యంగా సోషల్ మీడియా ఖాతాలో నజ్రియా చేసిన పోస్ట్ విడాకుల వార్తలకు దారి తీసింది. గత కొద్ది రోజుల నుండి నా వ్యక్తిగత జీవితం అంత బాగోలేదని, అందుకే మీతో దూరంగా ఉన్నానని, నా ఫ్రెండ్స్ కాల్ కూడా లిఫ్ట్ చేయలేకపోయానని,ఇలా ఒక పోస్ట్ పెట్టడంతో చాలామంది నెటిజన్లు భర్తతో విభేదాల కారణంగానే నజ్రియా సోషల్ మీడియాకి ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి దూరంగా ఉందని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే నటీనటటుల విడాకుల వార్తలు వినిపించగానే మొదట తెర మీదికి వచ్చేది వేరే వారితో అక్రమ సంబంధం.

నజ్రియా విడాకులు తీసుకోబోతుంది అనే రూమర్ బయటపడడంతోనే చాలామంది నెటిజన్లు నజ్రియాకి పలు హీరోలతో ఎఫైర్స్ ఉన్నాయని,ఈ ఎఫైర్స్ తెలిసే ఫహాద్ ఆమెని వదిలించుకోవాలని చూస్తున్నాడని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.ఇక మరి కొంతమందేమో పెళ్లయి ఇన్ని సంవత్సరాలైన కూడా ఇంకా పిల్లలు పుట్టకపోవడం కారణంగానే నజ్రియాని ఫహద్ ఫ్యామిలీ ఇబ్బంది పెట్టడంతో పిల్లల్ని కనడం ఇష్టం లేని నజ్రియా భర్తకి విడాకులు ఇవ్వబోతుందని ఇలా ఎవరికి తోచిన రూమర్లు వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి విడాకుల వార్తలపై నజ్రియా ఫహద్ లు ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే గానీ ఈ వార్తలు ఆగేలా లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: