తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో నాచురల్ స్టార్ నాని ఒకరు. ఈయన అష్టా చమ్మా అనే మూవీ తో హీరోగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని మంచి గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈయన వరుస పెట్టి విజయాలను అందుకుంటు టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన స్థాయికి చేరుకున్నాడు. ఇది ఇలా ఉంటే నాని తన కెరీర్లో ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది హీరోయిన్లతో ఆడి పాడాడు. కాకపోతే ఒక హీరోయిన్ మాత్రం నానికి అద్భుతంగా కలిసి వచ్చింది.

ఆమెతో నటించిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర నానికి విజయాలను అందించాయి. ఇంతకు నానికి అంతలా కలిసి వచ్చిన ఆ నటి ఎవరు అనుకుంటున్నారా ..? ఆ బ్యూటీ మరెవరో కాదు కీర్తి సురేష్. నాని హీరోగా రూపొందిన నేను లోకల్ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది. మొదటి సారి నాని , కీర్తి సురేష్ ఈ మూవీలోనే కలిసి నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ లో నాని , కీర్తి సురేష్ జంటకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

ఆ తర్వాత నాని , కీర్తి సురేష్ కాంబోలో దసరా అనే మూవీ వచ్చింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయింది. ఈ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా విడుదల చేశారు. దానితో ఈ మూవీ ద్వారా నానికి కీర్తి సురేష్ కు ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. నాని హీరోగా రూపొందిన ఈ రెండు సినిమాల్లో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించగా ఆ రెండు మూవీలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: