
మన సౌత్ సినిమా దగ్గర భారీ క్రేజ్ ఉన్న స్టార్ హీరోలలో స్టార్ హీరోలు నందమూరి నటసింహం బాలకృష్ణ అలాగే అటు తమిళ్ నుంచి బిగ్ స్టార్ అజిత్ కూడా ఒకరు. ఆ మాటకు వస్తే తమిళ హీరో అజిత్ కూడా తెలుగు వాడే. అజిత్ మన సికింద్రాబాద్ లో పుట్టినా కోలీవుడ్ లో స్టార్ హీరో గా ఎదిగాడు. ఇక ఈ బిగ్ స్టార్స్ మన దేశపు అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో వీరికి పలువురు సెలబ్రి టీ లతో పాటు సామాన్య ప్రజలు .. సినీ అభిమానుల నుంచి భారీ ఎత్తున శుభాకాంక్షలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు బిగ్ స్టార్స్ అజిత్ మరియు బాలయ్య లకి పవర్ స్టార్ అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
అటు కోలీవుడ్ తళ అజిత్ మరియు మన టాలీవుడ్ నటసింహం బాలయ్య రెండు చిత్ర పరిశ్రమలకు అందించిన సేవలు కొనియాడారు. ఈ క్రమంలోనే బాలయ్య, అజిత్ అభిమానులు పవన్ విషయంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే పవన్ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో రాణించడంతో పాటు అటు ఉప ముఖ్యమంత్రి గాను .. ఇటు సినిమాల్లో నూ రాణిస్తున్నారు. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా తో పాటు ఓజీ .. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లలో నటిస్తున్నారు. ఈ మూడు సినిమా లలో ముందుగా వీరమల్లు సినిమా ఆ తర్వాత ఓజీ సినిమా లు రిలీజ్ అవుతాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు