పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు అప్పుడప్పుడు ట్రోలింగ్ కి గురవుతూ ఉంటాయి.పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే అప్పుడప్పుడు వాళ్ళు చేసిన కొన్ని కామెంట్ల ద్వారా విమర్శల పాలవుతూ ఉంటారు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ని కొంతమంది నెటిజన్లు ఇంటర్ చదివారు ఇంతకంటే మీకు ఏం తెలుస్తుందిలే అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.మరి ఇంతకీ పవన్ కళ్యాణ్ చేసిన తప్పేంటి..ఎందుకు ఆయన్ని విమర్శిస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రాకముందు ఆయనకు ఉన్న అనారోగ్య సమస్యల కారణంగా చాలాసార్లు సూసైడ్ చేసుకొని చనిపోవాలనుకున్నారని, అలాగే ఎక్కువగా డిప్రెషన్ లోనే ఉండేవారనే విషయాన్ని మెగా ఫ్యామిలీతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పుకోచ్చారు.

అంతేకాదు ఎక్కువగా బుక్స్ చదువుతూ ఒంటరిగా ఉండడంతో చాలా లోన్లీగా ఫీల్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళానని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. అయితే ప్రస్తుతం తాను డిప్రెషన్ నుండి పూర్తిగా బయటపడ్డానని చెప్పుకొచ్చారు. అలాగే ఎవరైనా డిప్రెషన్ లో ఉంటే వారికి ఏ పనులు చేస్తే డిప్రెషన్ నుండి బయటపడతారు అనే విషయంలో సలహాలు, సూచనలు ఇచ్చారు. అయితే తన ఇంట్లో వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాం అనే మాట వారి నోటి నుండి రాగానే వెంటనే మీరు తిండి, నిద్ర మానేసి బయటికి వెళ్లి తోట పని చేయండి. అలా చేస్తే పని కారణంగా అలసిపోయి ఆకలి వేస్తుంది. అలాగే డిప్రెషన్ నుండి కూడా బయట పడతారు.

 శ్రమజీవులకి అంటే పనిచేసే వారికి డిప్రెషన్ అనేది ఉండదు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అంతేకాదు చాలామంది యూత్ కి ఇప్పుడు డిప్రెషన్ అనేది కామన్ పాయింట్ గా మారిపోయింది అంటూ చెప్పారు. అయితే పవన్ డిప్రెషన్ గురించి చెప్పిన సలహాలు, సూచనలు చాలా మందికి నచ్చలేదు.ఇంటర్ చదివారు కదా ఇంతకంటే ఎక్కువగా ఏం తెలుస్తుందిలే.. పనిచేయడానికి,డిప్రెషన్ కి,ఆకలికి ఏదైనా సంబంధం ఉందా.. ఇంటర్ చదివిన వారికి ఇంతకంటే ఎక్కువ తెలివి ఉండదులే అంటూ సోషల్ మీడియాలో కొంతమంది నెటిజెన్స్ పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: