టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత శుభం సినిమాతో నిర్మాతగా కూడా భారీ విజయాన్ని అందుకున్నారు. భవిష్యత్తులో సమంత నటిగా మళ్లీ బిజీ కానున్నారని తెలుస్తోంది. సమంత మా ఇంటి బంగారం సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఫ్యాన్స్ నా దగ్గరకు ఫోటోలు దిగడానికి వచ్చినప్పుడు ఎప్పుడూ నో చెప్పలేదని సమంత వెల్లడించడం గమనార్హం.
 
చెన్నైలో తండ్రి అంత్యక్రియలకు వెళ్తున్న సమయంలో సైతం కొంతమంది ఫ్యాన్స్ ఫోటో తీయడానికి నా దగ్గరకు వచ్చారని సమంత అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. అయినా నేను వారికి నో చెప్పలేదని ఎందుకంటే నా విజయానికి కారణం నా అభిమానులే అని ఆమె అన్నారు. మనం ఎలాంటి బాధలు అనుభవిస్తున్నానేమో వారికి తెలియకపోవచ్చని ఆమె వెల్లడించడం గమనార్హం.
 
అందుకే నేనెప్పుడూ అభిమానుల ఫోటోకు నో చెప్పనని సమంత చెప్పుకొచ్చారు. ఈ విషయంలో సమంత నిజంగా గ్రేట్ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. డిసెంబర్ లో నాన్న మరణించారని ఉదయం అమ్మ నుంచి ఫోన్ వచ్చిందని కొంతకాలంగా నాన్నతో మాట్లాడకపోవడంతో నేను షాక్ కు గురయ్యానని విమానంలోని కుర్చీలో అలాగే కూర్చుండిపోయానని సమంత పేర్కొన్నారు.
 
ఆ సమయంలో కొందరు నా ఫోటో అడగడం గుర్తుందని సమంత చెప్పుకొచ్చారు. నేను నిలబడి వాళ్లతో నవ్వుతూ ఫోటోలు దిగానని ఆమె వెల్లడించారు. మనం ఏ స్థితిలో ఉన్నామో వారికి తెలియదని తెలియని వాళ్లతో ఫోటో అడగటానికి చాలా ధైర్యం అవసరమని ఆమె చెప్పుకొచ్చారు. అందుకే నో చెప్పి వాళ్లను బాధ పెట్టాలని అనుకోలేదని సమంత కామెంట్లు చేయడం గమనార్హం. సమంత రెమ్యునరేషన్ ప్రస్తుతం 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. స్టార్ హీరోయిన్ సమంతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతుండగా త్వరలో క్రేజీ ప్రాజెక్ట్ లతో సమంత ప్రేక్షకుల ముందుకు రానున్నారు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: