
ఈ పరిస్థితుల మధ్య ఆమె నిర్మాతగా మారి తీసిన చిన్న సినిమా ‘శుభం’ గతవారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా సుమారు 5 కోట్ల కలక్షన్స్ ఈసినిమాకు మొదటి మూడు రోజులలోనూ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతున్న పరిస్థితులలో నిర్మాతగా సమంత తన మొదటి ప్రయత్నంలో విజయం సాధించినట్లుగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. రానున్న రోజులలో సమంత బ్యానర్ నుండి మరిన్ని మంచి సినిమాలు వచ్చే ఆస్కారం ఉంది అన్న ప్రచారం కూడ జరుగుతోంది.
ప్రస్తుతం సమంత లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి తన క్రేజ్ ను ఇండస్ట్రీలో కొనసాగే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. ఈవిషయంలో ఆమె నయనతార ను ఆదర్శంగా తీసుకుని మంచి పవర్ ఫుల్ లేడీ ఓరియెంటెడ్ కథలను తీవ్రంగా అన్వేషిస్తున్నట్లు టాక్. దీనికోసం సమంత టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కొందరు టాలెంటెడ్ రైటర్స్ దర్శకులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్.
ఈవిషయంలో ఆమె ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కూడ చర్చలు జరుపున్నట్లు తెలుస్తోంది. గతంలో సమంత తో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘అత్తారింటికి దారేది’ ‘అ ఆ’ సినిమాలు త్రివిక్రమ్ సమంతతో తీయడంతో పాటు ఆసినిమాలు బాగా హిట్ అవ్వడంతో త్రివిక్రమ్ ఆలోచనలలో ప్రస్తుతం సమంత ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నప్పటికీ ఆ ప్రాజెక్ట్ వచ్చే సంవత్సరానికి వాయిదా పడింది అని అంటున్నారు. ఈమధ్యలో వెంకటేష్ తో త్రివిక్రమ్ ఒక మూవీ చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఆవిషయం ఇంకా అధికారికంగా ప్రకటింప పడలేదు. ఈ గ్యాప్ లో సమంత కోసం ఒక ప్రాజెక్ట్ రెడీ చేసే పనిలో త్రివిక్రమ్ బిజీగా ఉన్నట్లు టాక్..