సినిమా ఇండస్ట్రీ లో ఈ మధ్య కాలంలో అనేక మంది బ్యూటీలు స్టార్ హీరోయిన్లుగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే స్పెషల్ సాంగ్స్ లలో నటించడానికి కూడా అత్యంత ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు. ఇకపోతే కొంత మంది స్టార్ నటిగా కెరియర్ను కొనసాగిస్తూనే వరుస పెట్టి ఐటమ్ సాంగ్ లలో కూడా నటిస్తూ వస్తున్నారు. ఇకపోతే మరి కొంత మంది మాత్రం స్టార్ హీరోయిన్ స్టేటస్ ఉన్న సమయంలో స్పెషల్ సాంగ్ లలో నటించి ఒకే ఒక్క సాంగ్ తో ఆపేసిన వారు కూడా ఉన్నారు. అలా ఒకే ఒక్క ఐటమ్ సాంగ్ చేసి ఆ తర్వాత వాటి జోలికి వెళ్లకుండా ఉన్న వారు ఎవరో తెలుసుకుందాం.

అనుష్క : టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ నటీమణులలో ఒకరు అయినటువంటి ఈ బ్యూటీ చాలా సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన స్టాలిన్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సాంగ్ అద్భుతంగా ఉండడం , ఇందులో అనుష్క తన అందాలతో , డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల ఈ సాంగ్ ద్వారా ఈమెకు మంచి క్రేజ్ వచ్చింది. అయిన కూడా ఈ మూవీ తర్వాత అనుష్క ఎప్పుడు ఏ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయలేదు.

కాజల్ అగర్వాల్ : టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన ఈ బ్యూటీ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన జనతా గ్యారేజ్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు కాజల్మూవీ లో కూడా స్పెషల్ సాంగ్ చేయలేదు.

సమంత : అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ లో స్పెషల్ సాంగ్ చేసింది. ఈ సినిమా విడుదల అయ్యి చాలా కాలమే అవుతున్న సమంత ఇప్పటివరకు మరే మూవీ లో కూడా ఐటమ్ సాంగ్ చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: