- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్‌, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన మోస్ట్ అవెటైడ్ సినిమా దేవ‌ర. గ‌త యేడాది చివ‌ర్లో ప్రేక్ష‌కుల ముంద‌కు వ‌చ్చిన ఈ సినిమా చాలా సైలెంట్ గా అది కూడా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుని ప్ర‌పంచ వ్యాప్తంగా ఏకంగా రు. 400 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూల్లు కొల్ల‌గొట్టింది. ఈ సినిమా తో ఎన్టీఆర్ స్టామినా ఏంట‌నేది మ‌రోసారి ఫ్రూవ్ అయ్యింది. దేవ‌ర సినిమా తో వ‌రుస‌గా ఎన్టీఆర్ ఖాతాలో నాలుగో హిట్ ప‌డింది.


దేవ‌ర హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి కూడా పార్ట్ 2 మీదే ఉంది. కొర‌టాల దేవ‌ర 2 ను ఎప్పుడెప్పుడు సెట్స్ మీద‌కు తీసుకు వెళ‌తాడా ? అని అంద‌రూ ఒక్క‌టే ఉత్కంఠ తో వెయిట్ చేస్తున్నారు. కొర‌టాల టీం ఇప్ప‌టికే దేవ‌ర 2  ప్రీప్రొడక్షన్ పనులు ... అలాగే స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా చేసే ప‌నుల్లో బిజీ బిజీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా ఆల్రెడీ వార్ 2 ట్రీట్ ఖాయం అయ్యింది. దీంతో ఎన్టీఆర్ - ప్ర‌శాంత్ నీల్ డ్రాగ‌న్ గ్లింప్స్ లేద‌ని చెప్పేశారు.


ఇక ఇప్పుడు మిగిలి ఉంది దేవర 2 మాత్ర‌మే. మరి దే’వర’ నుంచి కూడా ఎలాంటి అప్డేట్ ఉండదనే అనుకోవాలి. ఏదేమైనా దే వ‌ర 2 విష‌యంలో కొర‌టాల చాలా స‌స్పెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు. ఈ యేడాది చివ‌ర్లో దేవ‌ర 2ను సెట్స్ మీద‌కు తీసుకు వెళ్లేలా మేక‌ర్స్‌ ప్లాన్ చేస్తున్నారు. దేవర 2 లో చాలా స‌స్పెన్స్ ల‌కు ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ ఆన్స‌ర్ ఇవ్వ‌నున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: