
ప్రతి సీన్ షూట్ పూర్తైన తర్వాత మానిటర్ లో చూసుకున్న సమయంలో కూడా నవ్వులేనని విజయ్ దేవరకొండ కామెంట్లు చేశారు. ఎడిటింగ్ పూర్తైందని సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉన్నసమయంలో నోటా షూటింగ్ లో ఉన్నానని ఆ సమయంలో నిర్మాతలు కాల్ చేసి హైదరాబాద్ కు రావాలని చెప్పారని విజయ్ దేవరకొండ కామెంట్లు చేశారు. వాళ్ల వాయిస్ లో సీరియస్ నెస్ అర్థమైందని ఆయన పేర్కొన్నారు.
ఏం జరిగిందోనని తాను తెగ టెన్షన్ పడ్డానని హైదరాబాద్ రాగానే అల్లు అరవింద్ గారిని కలిశానని విజయ్ చెప్పుకొచ్చారు. ఇది వర్కౌట్ కాదు ఆపేద్దామని తదుపరి సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేద్దామని అల్లు అరవింద్ గారు చెప్పారని నేను షాకై మరోసారి సినిమా చూద్దాం సార్ అని చెప్పానని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చారు. సినిమా చూసిన సమయంలో నాకు నవ్వు రాలేదని ఆయన కామెంట్లు చేశారు.
నేను, డైరెక్టర్ మరో మ్యూజిక్ డైరెక్టర్ ను సెట్ చేస్తామని సమయం ఇవ్వాలని సూచించామని ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ జెన్స్ బోబోయ్ ను కలిసి సినిమా నేపథ్యం వివరించామని అతడి బీజీఎం సినిమా సక్సెస్ కు కారణమైందని విజయ్ దేవరకొండ తెలిపారు. రిలీజ్ కు ముందు ఈ సినిమా పైరసీ బారిన పడిందనే సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ కెరీర్ లో ఈ సినిమా స్పెషల్ అని చెప్పవచ్చు.