
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తర్వాత సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. సీనియర్ హీరో ... స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ తో - త్రివిక్రం ముచ్చటగా మూడో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. ఇక ఈ సినిమాను తనదైన మార్క్ ఎంటర్టైనర్ గా రూపించేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నారు. గతంలో వెంకటేష్ను త్రివిక్రమ్ డైరెక్ట్ అయితే చేయలేదు గాని వెంకటేష్ హీరోగా నటించిన రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలు నువ్వు నాకు నచ్చావ్ - మల్లేశ్వరి సినిమాలకు కథ - మాటలు అందించారు. ఇప్పుడు వెంకటేష్ను ఏకంగా డైరెక్ట్ చేస్తున్నారు. వెంకీ కూడా త్రివిక్రమ్ తో సినిమా చేసేందుకు 20 ఏళ్ల నుంచి వెయిటింగ్ లోనే ఉన్నాడు.
వాస్తవంగా త్రివిక్రమ్ గత ఏడాది మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమా తర్వాత ఏడదిన్నర పాటు బన్నీతో సినిమా చేసేందుకు ఎదురు చూపులు చూస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు బన్నీ త్రివిక్రమ్ కాదని తమిళ దర్శకుడు అట్లీ తో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. దీంతో త్రివిక్రమ్ కు ఇప్పుడు సడెన్ గా హీరో అంటూ ఎవరూ లేకపోవడంతో చివరకు వెంకటేష్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా అందాల భామ రుక్మిణి వసంతను సెలెక్ట్ చేశాడట త్రివిక్రమ్. ఈ సినిమాలో రుక్మిణి అయితే వెంకటేష్ పక్కన పర్ఫెక్ట్ గా సరిపోతుందని త్రివిక్రమ్ భావిస్తున్నాడట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు