తెలుగు సినీ పరిశ్రమలో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ప్రస్తుతం అద్భుతమైన స్థాయిలో కెరీర్ను ముందుకు సాగిస్తున్న వారిలో అడవి శేషు ఒకరు. ఈయన కెరియర్ను ప్రారంభించిన కొత్తలో చాలా సినిమాల్లో చిన్న పాత్రలలో నటించాడు. అలా కెరియర్ ముందుకు సాగిస్తున్న సమయంలోనే ఈయన క్షణం అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకు హీరోగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నుండి ఈయన నటించిన ప్రతి సినిమా అద్భుతమైన విజయం సాధిస్తూ రావడంతో ప్రస్తుతం అడవి శేషు టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా సూపర్ స్థాయిలో కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు.

ప్రస్తుతం అడవి శేషు "డాకాయిత్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్గా కనిపించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమా నుండి శృతి హాసన్ తప్పుకుంది. ప్రస్తుతం ఈ మూవీ లో మృణాల్ ఠాగూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ హక్కులను సోనీ సంస్థ ఏకంగా 8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది.

ఇలా ఈ మూవీ కి సంబంధించిన మ్యూజిక్ హక్కులను సోనీ సంస్థ 8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది అనే వార్త వైరల్ అవుతూ ఉండడంతో ఈ మూవీ లో మ్యూజిక్ ఏ స్థాయిలో ఉండి ఉంటుందో అని ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. అడవి శేషు హీరోగా రూపొందిన సినిమాలు వరుసగా మంచి విజయాలను సాధిస్తూ వెళ్లడంతో డాకాయిత్ సినిమాపై ప్రస్తుతానికి తెలుగు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: