తెలుగు రాష్ట్రాలలో నివశించే ప్రజలకు సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్ల గురించి గతంలో ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. నటుడిగానే కాకుండా సినిమా రంగంలో వేర్వేరు విభాగాల్లో ఆయన సత్తా చాటారు. సినిమా ఇండస్ట్రీకే క్రమశిక్షణ నేర్పిన నటుడిగా సీనియర్ ఎన్టీఆర్ కు పేరుందని చెప్పవచ్చు.
 
అవసరం అనుకుంటే ఆయన ఏకంగా మూడు షిఫ్ట్ లలో పని చేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు ఒకింత ఆశ్చర్యకరంగా ఉంటాయి. అల్పాహారంగా ఆయన 20 ఇడ్లీలను సైతం సులువుగా తినేవారని సమాచారం అందుతోంది. ఆ తర్వాత ఎన్టీఆర్ గారు ఆపిల్ జ్యూస్ ను ఎంతో ఇష్టంగా తాగేవారట. సాయంత్రం సమయంలో మాత్రం డ్రై ఫ్రూట్స్, బజ్జీలను ఎంతో ఇష్టంగా తినేవారట.
 
రోజుకు ఎన్టీఆర్ ఏకంగా రెండు లీటర్ల బాదం పాలను తాగేవారని భోగట్టా. లంచ్ సమయంలో మాత్రం మామిడి పళ్ల రసంలో గ్లూకోజ్ పౌడర్ వేసుకొని తాగేవారట. ఎంత ఆహారం తీసుకున్నా అందుకు తగిన వర్క్ చేసేవారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదని సమాచారం అందుతోంది. సీనియర్ ఎన్టీఆర్ ఆహారపు అలవాట్లు ఒకింత ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయని చెప్పవచ్చు.
 
సీనియర్ ఎన్టీఆర్ నటుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా మెప్పించారు. సీనియర్ ఎన్టీఆర్ ఖాతాలో ఎన్నో విజయాలు ఉన్న సంగతి తెలిసిందే. ఎంతోమంది నటీనటులకు ఆయన ఒకింత ఇన్ఫ్పిరేషన్ గా నిలిచారు. సినిమాల కోసం సీనియర్ ఎన్టీఆర్ పడిన కష్టం అంతాఇంతా కాదు. నందమూరి ఫ్యామిలీకి ఈ స్థాయిలో పేరు ప్రతిష్టలు ఉండటానికి ఆయనే కారణమని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.


ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు
 


మరింత సమాచారం తెలుసుకోండి: