తెలుగు సినీ పరిశ్రమలో ఒకానొక సమయంలో ఎంతో మంది సీనియర్ హీరోలు ఉండేవారు. అందులో కొంతమంది మాత్రమే వారి సినిమాలతో సక్సెస్ సాధించారు. గతంలో సీనియర్ హీరోలు కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే చేసేవారు. అలాంటి హీరోలలో సీనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఎన్టీఆర్ అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకున్నాడు. తన సినిమాలతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అనేక సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోగా తన సత్తాను చాటుకున్నాడు. ఓవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.

 రాజకీయాలలో తన వంతు పాత్రను పోషించారు. ఎన్నో రకమైన సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకువచ్చి ప్రజలకు తన వంతు న్యాయం చేశారు. ఇక ఎన్టీఆర్ నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. తన కెరీర్ లో ఎన్టీఆర్ ఏకంగా తల్లి, కూతురు ఇద్దరితో కలిసి రొమాన్స్ చేసి ఓ అరుదైన ఘనతను సృష్టించారు. తెలుగు సినీ పరిశ్రమలో తల్లి కూతుర్లతో కలిసి నటించిన ఏకైక హీరో ఎన్టీఆర్ ఒక్కరు మాత్రమే కావడం విశేషం. జయచిత్ర 1976లో వచ్చిన మా దైవం సినిమాతో మొదటిసారిగా సీనియర్ హీరో ఎన్టీఆర్ తో జతకట్టింది. ఈ సినిమా బాలీవుడ్ సినిమాకు రీమేక్ గా వచ్చింది. ఇందులో ఎన్టీఆర్ ఒక జైలర్ పాత్రలో నటించారు. ముద్దాయిలను మంచి వాళ్ళను చేయవచ్చు అని రామారావు నమ్మకంతో ఉండేవారు.

అంతే కాదు నేరాలు చేసిన వారిని జైల్లోకి తీసుకువచ్చి వారిని మంచి వాళ్ళను చేసి వారి జీవితాలలో వెలుగు నింపేవాడు. ఇందులో ఎన్టీఆర్ హీరోగా జయశ్రీ హీరోయిన్ గా నటించారు. అంతకన్నా ముందే 1959లో దైవబలం అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో జయ చిత్ర తల్లి జయశ్రీ అలియాస్ అమ్మాజీతో ఎన్టీఆర్ నటించారు. ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాలలో తల్లి కూతుర్లు హీరోయిన్లుగా నటించారు. వారిద్దరి సరసన ఎన్టీఆర్ హీరోగా నటించి వారితో రొమాన్స్ చేశాడని అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: