
ఇక ఒకవైపు ఫ్యాన్స్ మరొకవైపు ఆడియన్స్ కూడా మహేష్ బాబు ఖలేజా సినిమాని చూడడానికి మరింత ఆసక్తి చూపిస్తున్నారు.. ఖలేజా సినిమా రిలీజ్ హంగామా అటు హైదరాబాద్, ఏలూరు, నల్లజర్ల ,వైజాగ్ వంటి ప్రాంతాలు ఆని తేడా లేకుండా అన్నిచోట్ల కూడా కలెక్షన్స్ పరంగా ఊచ కోత కోస్తోంది. అయితే ఈ సినిమా చూసిన ఆడియన్స్ 15 ఏళ్ల క్రితం ఈ సినిమా వచ్చినప్పుడు డిజాస్టర్ ని చేశారు కానీ ఇప్పుడు ఈ సినిమాని ఎందుకు డిజాస్టర్ చేసామో అన్నట్లుగా మాట్లాడుతున్నారు.
ఖలేజా చిత్రంలో అనుష్క, మహేష్ బాబు మధ్య వచ్చే సన్నివేశాలు.. ఆలీ, సునీల్ కామెడీసన్నివేశాలు కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉన్నాయి. త్రివిక్రమ్ రాసుకున్న పవర్ ఫుల్ డైలాగులు కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఇంతటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాని అప్పుడు ఫ్లాప్ చేసి తప్పు చేశామని అందుకే ఇప్పుడు సూపర్ హిట్ చేస్తున్నాం అన్నట్లుగా తెలుగు సినీ ప్రేక్షకులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి డైరెక్షన్లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా 2027 లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.