పాన్ ఇండియ‌ హీరో ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం వచ్చేస్తుంది .. ది రాజా సాబ్‌ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది .. డబ్బింగ్ పనులు కూడా అయిపోయినట్టు తెలుస్తుంది .. అలాగే రీ రికార్డింగ్ పనులు కూడా చకచకా జరుగుతున్నాయి .. అతి త్వరలోనే ఈ మూవీ టీజర్ ని కూడా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు .. అన్ని అనుకున్నట్టు కుదిరితే జూన్ 6 న ఈ మూవీ టీజర్ రాబోతుందని అంటున్నారు .. అలాగే దీని పై ఒకటి రెండు రోజుల్లో అప్డేట్ కూడా ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది .. మారుతి డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమా లో ప్రభాస్ ది రాజా సాబ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు .
 
 
భూత , వర్తమాన కాలాన్ని బట్టి ఈ సినిమా స్టోరీ ఉండబోతున్నట్టు తెలుస్తుంది .. ఇప్పటి వరకు ప్రభాస్ ఇలాంటి హారర్ సినిమా లో నటించలేదు .. అలాగే టాలీవుడ్ లోని ఏ స్టార్ హీరో కూడా ఇలాంటి దేయ్యం సినిమా లో నటించలేదు .. అందుకే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి .. టీజర్ వచ్చిన తర్వాత సినిమా పై అంచన‌లు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయ ని అంటున్నారు .. ఇప్పటివరకు ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తప్ప ఇంకెలాంటి అప్డేట్లు సినిమా నుంచి రాలేదు .  ఇక మరి ఈ సినిమా నుంచి వరుస గా అప్డేట్లు ఉంటాయని కూడా అంటున్నారు .. ఇక‌ మరి ఈ మూవీ ని డిసెంబర్ 5 న ప్రేక్షకులు ముందుకు తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు .. ఇక మరి ప్రభాస్ రాజా సాబ్‌ సినిమా తో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి ..

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: