
నాగచైతన్య మొదట నటి సమంతని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన కొంత కాలానికి వీరిద్దరూ పలు కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నటుడు నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ళని అన్నపూర్ణ స్టూడియోస్ లో రెండో వివాహం చేసుకున్నాడు. నాగచైతన్య, శోభితాను కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత నాగచైతన్య చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు. తర్వాత చైతు తండాల్ మూవీలో నటించి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇప్పుడు చైతు తన భార్య శోభితాతో హాయిగా బ్రతుకుతున్నారు.
అయితే నేడు శోభితా ధూళిపాళ్ళ పుట్టినరోజు. ఈ రోజు ఆమె 33వ బర్త్ డే జరుపుకుంటుంది. ఈ సందర్భంగా శోభితా భర్త నాగచైతన్య ఆమెకి బర్త్ డే విషెస్ చెప్పారు. తన సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్ట్ పెట్టారు. అందులో శోభితాతో కలిసి తీసుకున్న ఫోటోస్ ని షేర్ చేశారు. హ్యాపీ బర్త్ డే మై లేడీ అంటూ ఒక క్యాప్షన్ ని కూడా జత చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోస్ చూసిన సినీ స్టార్స్ ఆమెకి విషెస్ చెప్తున్నారు. నెటిజన్స్ కొందరు క్యూట్ గా ఉన్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.