కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్ కుమార్ అందరికి సుపరిచితమే. మంచు మనోజ్ మొదట 2004లో దొంగ దొంగది సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యారు. ఆ తర్వాత బిందాస్, రాజు భాయ్, నేను మీకు తెలుసా, ప్రయాణం, వేదం, ఝుమ్మంది నాదం, మిస్టర్ నూకయ్య, పోటుగాడు, కరెంటు తీగ, పాండవులు పాండవులు తుమ్మెద, గుంటూరోడు, ఇది నా లవ్ స్టోరీ వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

బిందాస్ సినిమాగాను నాంది స్పెషల్ జూరి అవార్డుని సొంతం చేసుకున్నారు. అంతేకాదు మనోజ్ చిన్న వయసులోనే మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నాదేశం, అడవిలో అన్న, ఖైదీ గారు సినిమాలలో బాల నటుడిగా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందారు. ఇకపోతే ఈయన మొదట ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్నారు.

తాజాగా మంచు మనోజ్ భైరవం సినిమాతో ప్రేక్షకులను అలరించారు. ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ మూవీలో మనోజ్ తో పాటు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ కూడా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు డైరెక్టర్ గా విజయ్ కనకమెడల వ్యవహరించారు. ప్రస్తుతం ఈ సినిమా మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఈ సందర్భంగా ఇటీవల భైరవ మూవీ సక్సెస్ మీట్ ని కూడా నిర్వహించారు. అందులో మంచు మనోజ్ తన నెక్స్ట్ మూవీపై క్లారిటీ ఇచ్చారు. 90 ఎం.ఎల్ అనే సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన శేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఆయన నెక్స్ట్ మూవీ రాబోతుందని మంచు మనోజ్ అనౌన్స్ చేశారు. ఆ సినిమా మోస్ట్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని అన్నారు. ఆ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ అయ్యామని..  మూవీ టైటిల్ అదిరిపోయిందని చెప్పుకొచ్చారు. త్వరలోనే మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తామని మంచు మనోజ్ స్పష్టం చేశారు. ఇది విన్న మంచు అభిమానులు గ్రేట్ న్యూస్ అంటూ మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: