
నటుడు షైన్ టామ్ చాకో, అతని తల్లి మరియా కార్మెల్, సోదరుడు మరియు డ్రైవర్ కూడా అదే కారులో ప్రయాణిస్తుండగా వారికి గాయాలయ్యాయి. వారందరినీ వెంటనే పోలీసులు మరియు స్థానికులు ధర్మపురిలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్చారు. చాకో కుటుంబం ఎర్నాకుళం నుండి బెంగళూరుకు వెళ్తుండగా పాలయూర్ సమీపంలో ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని పాలకోడ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం తెలుస్తోంది.
నటుడు షైన్ టామ్ చాకో కారు వెనుక భాగంలో నిద్ర పోతున్నాడని.. ప్రమాదంలో అతని కుడి చేయి విరిగిందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం షైన్ టామ్ చాకోకు అత్యవసర శస్త్ర చికిత్స జరుగుతుంది. షైన్ తల్లి మరియా కార్మెల్ మరియు సోదరుడికి స్వల్ప గాయాలు అయ్యాయి. వారికి ప్రస్తుం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ, షైన్ తండ్రి సీపీ చాకో మరణించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు