శ్రీలీల క్యూట్ గా కనిపిస్తూ తన అమాయకపు లుక్స్ తో ఎంతోమందిని తన వశం చేసుకుంది.ప్రస్తుతం శ్రీలీల గ్రాఫ్ ఇండస్ట్రీలో ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. వరుస ఫ్లాప్స్ వచ్చినా కూడా శ్రీలీల జోరు కంటిన్యూ చేస్తుంది. ఈ మధ్యకాలంలో సౌత్ మాత్రమే కాకుండా నార్త్ ఇండస్ట్రీలోకి కూడా వెళ్ళింది.అలా బాలీవుడ్లో 2,3 సినిమాలు కూడా చేస్తుంది. అయితే అలాంటి  ఈ ముద్దుగుమ్మ బయటికి కనిపించేంత మంచిదేం కాదు అంటూ ఓ స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఇంతకీ శ్రీలీల నిజ స్వరూపం ఎలాంటిది..ఆ డైరెక్టర్ చెప్పిన మాటల్లో ఉన్నది ఎంత నిజం అనేది ఇప్పుడు చూద్దాం.. శ్రీలీల పెళ్లి సందడి, ఆది కేశవ, ధమాకా, భగవంత్ కేసరి,స్కంద, రాబిన్ హుడ్, ఎక్స్ట్రా ఆర్డినరీ,గుంటూరు కారం వంటి సినిమాలు చేసింది.

 ఈ సినిమాల్లో పెళ్లి సందD యావరేజ్ హిట్ ధమాకా, భగవంత్ కేసరి,గుంటూరు కారం ఈ మూడు సినిమాలు శ్రీలీల గ్రాఫ్ ఇండస్ట్రీలో పెరిగేలా చేశాయి. ఇక అప్పటినుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా వరుస ప్రాజెక్టులు చేస్తుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ గురించి తాజాగా సీనియర్ డైరెక్టర్ గీత కృష్ణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. శ్రీలీల మీరు అనుకుంటున్నంత మంచిదేం కాదు. బయటికి కనిపించేంత అమాయకురాలేం కాదు.ఆమె పెద్ద ముదురు.. ఆమెను సినిమాలు లేకపోతే ఎక్కడ ప్రేక్షకులు గుర్తించడం మానేస్తారో అని సోషల్ మీడియాలో ఎప్పుడు ఏదో ఒక విధంగా హాట్ టాపిక్ గా ఉందామని చూస్తుంది.ఆ మధ్యకాలంలో కార్తిక్ ఆర్యన్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తల్లో నిలిచింది.

ఇలా చాలామంది సెలబ్రిటీలు డేటింగ్ వార్తలతో సోషల్ మీడియాలో వైరల్ అయి అభిమానులకి దగ్గరగా ఉంటారు. అందుకే ఈ డేటింగ్ వార్తలపై ఎక్కువగా స్పందించరు. వాటి వల్ల తమకు మరింత పేరు వస్తుందని మాత్రమే చూస్తారు. ఇక కార్తిక్ ఆర్యన్ తో డేటింగ్ వార్తల తర్వాత పెళ్లి చేసుకుంటున్నట్టు కొన్ని ఫోటోలు చక్కర్లు కొట్టాయి.ఆ తర్వాత రెండు రోజులకు నేను పెళ్లి చేసుకోవడం లేదని,అవి ప్రీ బర్త్ డే సెలబ్రేషన్స్ అని, మా అమ్మ సినిమాల్లోకి రాకముందు నా బర్త్ డే సెలబ్రేషన్స్ ని ఇలాగే చేసేదని అందుకే ఇప్పుడు ఇలా చేసింది అంటూ కవర్ చేసుకుంది. అలా పెళ్లి వార్తలతో కూడా శ్రీలీల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది.

అలా సినిమాలు ప్లాప్ అయినా కూడా ఇలాంటి కొన్ని హాట్ టాపిక్స్ ద్వారా ఇండస్ట్రీలో మరింత ఫేమస్ అవుదామని ప్రేక్షకులకు మరింత దగ్గరగా ఉందామని శ్రీలీల ఇలాంటి పనులు చేస్తుంది ఆమె మీరు అనుకున్నంత మంచిదేం కాదు పెద్ద ముదిరే తన మార్కెట్ పెంచుకోవడానికి ఇలాంటి వార్తల ద్వారా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ఉంటుంది. బయటికి కనిపించేంత సాఫ్ట్ కాదు అంటూ సంచలన విషయాలు చెప్పారు గీతాకృష్ణ.. ఇక ఈ డైరెక్టర్ మాటల్ని బట్టి చూస్తే శ్రీలీల మాత్రమే కాదు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో హీరోయిన్ ఇలాంటి డేటింగ్ వార్తలపై పెళ్లి వార్తలపై అందుకే స్పందించరని అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: