
ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ వార్ 2 . ఈ సినిమా స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఒకరోజు ముందుగా ఆగస్టు 14న థియేటర్లలోకి రాబోతుంది. తాజాగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ గురించి క్రేజీ రూమర్ బయటకు వచ్చేసింది. ఈ సినిమాలో ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం భారీ ఎత్తున స్పెషల్ వీఎఫ్ఎక్స్ కోసం పెద్ద పీఠ వేసి చాలా గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో యాక్షన్ .. విజువల్స్ అత్యుత్తమంగా ఉంటాయని మేకర్ చెప్తున్నారు. ఇక ఈ సినిమాలో రెండు పాటలు మాత్రమే ఉంటాయని తెలుస్తోంది. అందులో ఒక పాట హృతిక్ రోషన్ - కియారా అద్వానిపై తీశారట. ఈ పాటలో కీయారా బికినీలో కనిపిస్తుందని .. ఇక రెండో పాటను ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ పై షూట్ చేయనున్నారని తెలుస్తోంది.
వచ్చేనెల లో హృతిక్ - తారకపై ఈ పాటను ఏడు రోజులు పాటు షూట్ చేస్తారట. ఈ పాటలో తారక్ స్టెప్పులు అదిరిపోతాయని తెలుస్తుంది. ఈ యేడాది నేషనల్ వైడ్‌గా మోస్ట్ అవైటెడ్ సినిమాలలో వార్ 2 ఫస్ట్ ప్లేస్ లో ఉంటుందని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు ధీమాగా చెబుతున్నాయి. పైగా ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కోసం అభిమానులు మాత్రమే కాదు .. తెలుగు సినిమా ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. కీయారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. ఆయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు