
క్యాన్సర్ ను జయించిన సోనాలి బింద్రే ఆ తర్వాత ఎన్నో ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేసింది. ప్రస్తుతం పలు చిత్రాలలో క్యామియో పాత్రలలో కూడా నటిస్తోంది. క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాలో న్యూయార్క్ కి వెళ్ళినప్పుడు తన ట్రీట్మెంట్ గురించి సల్మాన్ ఖాన్ ప్రతిసారి అడిగేవారు అంతే కాకుండా తనకి చికిత్స పొందుతున్నప్పుడు రెండుసార్లు సైతం వచ్చి చాలా అవసరమైన సమయంలో అండగా నిలిచారని తెలిపింది. అలాగే పలు సార్లు తన భర్తకు ఫోన్ చేసి అవసరమైన సమయాలలో సహాయం చేశారని తెలిపింది సోనాలి బింద్రే.
అలా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని తెలియజేసింది.1999లో వచ్చిన హాయ్ సాత్ సాత్ హై సినిమాలో సల్మాన్ ఖాన్ కి జంటగా నటించింది. ఆ సినిమా షూటింగ్ సమయంలో కూడా సోనాలి బింద్రే సల్మాన్ ఖాన్ పైన తీవ్రమైన విమర్శలు చేసినప్పటికీ.. తనను చూస్తే సల్మాన్ ఖాన్ ముఖం తిప్పుకునేవారని.. ఎప్పుడు సల్మాన్ ఖాన్ తో పోట్లాడుతూ ఉండేదాన్ని అంటూ తెలిపింది. కానీ సల్మాన్ ఖాన్ బయట కనిపించినంత కఠినాత్ముడు కాదు అంటూ తెలుపడం జరిగింది. దీంట్లో సల్మాన్ ఖాన్ పైన ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. మరి ఈ విషయంపై సల్మాన్ ఖాన్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.