టాలీవుడ్ నటుడు నితిన్ ప్రస్తుతం తమ్ముడు అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను జూలై 4 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను కూడా తాజాగా ఈ మూవీ బృందం వారు విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన అనేక ఆసక్తికరమైన వివరాలను ఈ మూవీ బృందం తెలియజేసింది.

మూవీ నిర్మాత అయినటువంటి దిల్ రాజు మాట్లాడుతూ ... ఈ సినిమా ట్రైలర్ను ఆరు నెలల క్రితమే రెడీ చేసాం అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ఈ సినిమా దర్శకుడు అయినటువంటి వేణు శ్రీరామ్ మాట్లాడుతూ ... ఈ సినిమా ట్రైలర్ను చాలా కాలం క్రితమే రెడీ చేసి ఉంచాం. కానీ ఈ సినిమా విడుదల తేదీ కన్ఫామ్ అయ్యాకే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయాలి అనుకున్నాం. ఇక ఈ సినిమా విడుదలకు సమయం చాలా దగ్గర పడిన తర్వాత ఈ మూవీ నుండి రిలీజ్ ట్రైలర్ను కూడా విడుదల చేస్తాం. ఈ మూవీలో అనేక ట్రైలర్ను విడుదల చేసే కంటెంట్ ఉంది.

ఈ మూవీలో ఎమోషన్ బలంగా ఉంది. ఈ సినిమా నుండి ఎన్ని ట్రైలర్స్ అయినా విడుదల చేయవచ్చు. అంత స్టోరీ ఈ మూవీ లో ఉంది అని ఈ మూవీ దర్శకుడు వేణు శ్రీరామ్ తాజాగా చెప్పుకొచ్చాడు. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: