ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవాలి అంటే హీరోయిన్లకు అదృష్టం తో పాటు టాలెంట్ ఫిజిక్ కు కూడా మెయింటైన్ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అయితే కొంతమంది హీరోయిన్స్ తమ గ్లామర్ ని నమ్ముకొని మరి యాక్టింగ్ చేస్తూ ఉండగా.. మరి కొంతమంది తమ నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటిస్తూ ఉంటారు. అలాంటి వారిలో హీరోయిన్ నివేదా థామస్ కూడా ఒకరు. ఇటీవలే గద్దర్ అవార్డు వేడుకలో కనిపించిన ఈ అమ్మడును చూసి అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే నివేదా చాలా మారిపోయినట్టుగా కనిపిస్తోంది.


కేరళలకు చెందిన నివేద థామస్ ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి చెన్నైలో ఉన్నది. 2016 లో వచ్చిన నాని జెంటిల్మెన్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు ఆ తర్వాత జై లవకుశ, నిన్ను కోరి, వకీల్ సాబ్, 35 చిన్న కథ కాదు వంటి చిత్రాలలో కూడా నటించింది. ఈ సినిమాకి ఉత్తమ నటిగా ఈమెకు గద్దర్ అవార్డు అందుకుంది. శనివారం రోజున హైదరాబాదులో గద్దర్ అవార్డు వేడుకలను చాలా గ్రాండ్గా చేసింది తెలంగాణ ప్రభుత్వం. నివేదా థామస్ అక్కడ హాజరు అవ్వగా ఆమెను చూసి అందరూ ఆశ్చర్యపోయారు


నివేదా థామస్ చాలా లావుగా మారిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. నివేదాన్ని చూసిన అందరూ కూడా ముక్కున వేలు వేసుకునేలా కనిపిస్తోంది. మొదట ఏమైనా చూసి ఎవరా అని అభిమానులు కూడా ఆశ్చర్యపోయారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం నివేద థామస్ చేతిలో ఎలాంటి సినిమాలు లేవని తెలుస్తోంది. మొత్తానికి ఒకప్పుడు కుర్రాళ్ళ కలల రాణిగా పేరుపొందిన నివేదా ఈ మధ్యకాలంలో మరింత బరువు పెరిగిపోయినట్టుగా కనిపిస్తోంది. మరి అభిమానులు నివేదా ను స్లిమ్ అవ్వమని కోరుకుంటున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా సినిమాలలో నటిస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: