టాలీవుడ్ బాక్సాఫీస్  ముందుకు రాబోతున్న పెద్ద సినిమాల్లో కుబేర కూడా ఒకటి .  టాలీవుడ్ విలక్షణ దర్శకుడు  శేఖర్ కమ్ముల  నుంచి వస్తున్న సినిమా కావటంతో సినిమాపై భారీ అంచునాలు నెలకొన్నాయి .  అలాగే ధనుష్ , నాగార్జున , రష్మిక మందన్న‌ వంటి అగ్రతారలు ఈ సినిమాలో నటించడంతో అంచనాలు మరో స్థాయికి వెళ్ళాయి . అయితే ఇప్పుడు ఈ సినిమా పై దర్శకుడు  శేఖర్ కమ్ముల  చూపిస్తున్న కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది .. అయితే ఆయన ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇప్పటికే 25 సంవత్సరాలవుతుంది .. కానీ ఇప్పటివరకు ఏ సినిమాపై చూపినంత గట్టి నమ్మకాన్ని కుబేర పై ఆయన చూపిస్తున్నారు  .


ఇది ప్రేక్షకుడు తల ఎత్తుకొని చూసే సినిమా .. ఇలాంటి సినిమా ఇప్పటివరకు ఎప్పుడు చూసి ఉండరు .  ఇలాంటి అద్భుతమైన కథ నాకు రావడం నా అదృష్టం .  సినిమా కూడా ఎంతో అద్భుతంగా వచ్చింది .. అంటూ భారీ స్టేట్మెంట్లు కూడా  శేఖర్ కమ్ముల  నుంచి రావడం కూడా ఎంతో కొత్తగా ఉంది.  అలాగే నాగార్జున , రష్మిక , ధనుష్ వంటి పెద్ద హీరోలతో పనిచేయడం కూడా శేఖర్ కు ఇదే మొదటిసారి .  అలాగే దేవిశ్రీ లాంటి మాస్ మ్యూజిక్ డైరెక్టర్ తో కుబేర కోసం ఆయన కలిసి పనిచేశారు .. ఇలా కాంబినేషన్స్ పరంగా చూసిన కుబేర ఓ స్పెషల్ ప్రాజెక్ట్ గానే కనిపిస్తుంది.

 

ఇక ఇప్పటికే ట్రైలర్ కూడా వచ్చేసింది .  శేఖర్ తన మార్కు దాటి ఏదో కొత్త పాయింట్ ను చూపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది .. వీటికి తోడు రాజమౌళి స్వయంగా ట్రైలర్ మైండ్ బ్లోయింగ్ గా ఉంది అని ప్రశంసించడం కుబేర టీం లో మరింత నమ్మకాన్ని గట్టిగా పెంచేసింది .. అలాగే ఒక రచయిత దర్శకుడుగా శేఖర్ అవుట్ ఆఫ్ ది బాక్సాఫీస్ పాయింట్ తోనే కుబేరను తీసుకురాబోతున్నారు .. లేకపోతే ఆయన ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకంటారు .. అయితే ఆయన అనుకున్న పాయింట్ ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది ఈ సినిమా సక్సెస్ ను నిర్ణయిస్తుంది .  మరి రాబోయే మూడు రోజుల్లో అసలైన ఫలితం బయటకు రానుంది .. శేఖర్ నమ్మకం నిజం కావాలని కోరుకుందాం ,, ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ కి ఓ భారీ సక్సెస్ ఎంతో అవసరం .

మరింత సమాచారం తెలుసుకోండి: