జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.  పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాల  షూటింగ్ లలో  పాల్గొంటుండగా  పవన్ ఫిట్ నెస్ కు సంబంధించి షాకింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి.  అయితే పవన్ బరువు తగ్గడం వెనుక డైట్ సీక్రెట్ ఉందని తెలుస్తోంది.  రోజుకు కేవలం ఒకసారి  మాత్రమే భోజనం తీసుకుని  పవన్ హెల్త్ విషయంలో కేర్ తీసుకున్నారని సమాచారం.

ఇలా రోజుకు  ఒకసారి మాత్రమే భోజనం చేసే సమయంలో  బ్లాక్ కాఫీ మాత్రమే తీసుకునేవారని భోగట్టా.  మధ్యాహ్నం సమయంలో లైట్ మీల్స్ మాత్రమే తీసుకునేవారని భోగట్టా.  రాత్రి సమయంలో మజ్జిగ లేదా జ్యుస్  తాగడం చేసేవారట.  ఈ చిట్కాలను పాటించడం  ద్వారా పవన్ కళ్యాణ్ ఏకంగా  10 కిలోల బరువు తగ్గారు.  బరువు ఎక్కువగా ఉన్నవాళ్లకు ఈ డైట్ ఎంతో  ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

మరీ కడుపు  మాడ్చుకోకుండా  పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది.   పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుండగా వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. పవన్ పారితోషికం సైతం ఒకింత భారీ స్థాయిలో  ఉందనే  సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్ హెల్త్ విషయంలో ఎంతో  కేర్ తీసుకుంటూ ఉండటం ఫ్యాన్స్ కు సైతం  ఆనందాన్ని కలిగిస్తోంది.  పవన్ రెమ్యునరేషన్ 60 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.  పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ లను ఎంచుకుంటే  మరిన్ని విజయాలను అందుకుంటే బాగుంటుందని  కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  పవన్ కళ్యాణ్  సాధిస్తున్న రికార్డులు నెట్టింట సంచలనం అవుతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: