గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ప్రస్తుతం పెద్ది అనే సినిమా రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శివరాజ్ కుమార్ , జగపతి బాబు కీలకమైన పాత్రలలో కనిపించనుండగా ... మీర్జాపూర్ వెబ్ సిరీస్ ద్వారా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దివ్యేండు ఈ మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ రోజు దివ్యేందు పుట్టిన రోజు కావడంతో ఆయన పుట్టిన రోజు సందర్భంగా పెద్ది మూవీ నుండి ఈ సినిమా నుండి ఆయనకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేసింది.

పోస్టర్ ద్వారా దివ్యేందు ఈ సినిమాలో రామ్ బుజ్జి అనే పాత్రలో కనిపించనున్నట్లు ఈ మూవీ బృందం వారు ప్రకటించారు. ఈ పోస్టర్లో ఈయన ఒక బాలు పట్టుకొని నిలబడి ఉన్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన గ్లీమ్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. దానికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి వచ్చింది. ఇక ఆ గ్లిమ్స్ వీడియోలో లాస్ట్ షాట్ లో చరణ్ బ్యాటింగ్ చేస్తూ ముందుకు పరిగెత్తి బ్యాట్ ను నేలకి కొట్టి ఆ తర్వాత బాల్ ను కొడతాడు. ఆ షాట్ అద్భుతమైన ఇంపాక్ట్ ను ఇండియా వ్యాప్తంగా చూపించింది. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్న దివ్యేందు చేతిలో బాల్ పట్టుకొని నిలబడి ఉన్నాడు.

దానితో ఈ సినిమాలో చరణ్ అద్భుతమైన బ్యాటర్ పాత్రలో కనిపిస్తే , దివ్యేందు ఒక అద్భుతమైన బౌలర్ పాత్రలో కనిపిస్తాడా ..? చరణ్ , దివ్యేందు మధ్య అసలు పోరాటం ఉంటుందా ..? ఇలా అనేక ప్రశ్నలు జనాల్లో రేకెత్తుతున్నాయి. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి పెద్ది సినిమాపై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన విడుదల చేయనున్నట్లు చాలా కాలం క్రితమే ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే ఇంకా చాలా కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: