ఇప్పుడు ఎక్కడ చూసినా సరే హీరో ధనుష్ ని  ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు . దానికి వన్ అండ్ ఓన్లీ మెయిన్ రీజన్ "కుబేర" మూవీ . శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన తాజా మూవీ "కుబేర". ఈ సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ షోకే సూపర్ డూపర్ హిట్  టాక్ అందుకునేసింది.  ఎక్కడ చూసినా సరే ధనుష్ పర్ఫామెన్స్ ని ఆ రేంజ్ లో పొగిడేస్తున్నారు జనాలు. ధనుష్ లా ఇండస్ట్రీలో ఏ హీరో లేడు అని.. ఆయన ఎంత చక్కగా బిచ్చగాడి పాత్రలో నటించి అందరి హీరోలకి ఇన్స్పిరేషన్ గా నిలిచారు అని .. పాన్ ఇండియా స్టేటస్ ఉంటే సరిపోదు జనాలను ఎంటర్టైన్ చేయాలి అని.. జనాలకు మెసేజ్ ఇవ్వాలి అన్న ఇలాంటి క్యారెక్టర్ లో నటించాలి అన్నా దానికి ధనుష్ మంచి ఛాయిస్ అంటూ ఓ రేంజ్ లో పొగుడుతూ మాట్లాడుతున్నారు కొంతమంది జనాలు .


ఇలాంటి మూమెంట్లోని కోలీవుడ్ స్టార్స్  బెస్ట్ అని టాలీవుడ్ యాక్టర్స్ వేస్ట్ అంటూ రకరకాలుగా కామెంట్స్ వైరల్ అవుతున్నాయి . అయితే ధనుష్ చేసిన పని ఎప్పుడో 30ఏళ్ళ క్రితమే బాలయ్య చేశాడు అంటూ నందమూరి ఫ్యాన్స్ గుర్తు  చేస్తున్నారు . 1994 లో వచ్చిన "భైరవ దీపం" సినిమాలో నందమూరి బాలకృష్ణ కుల్ఫీగా నటించి మెప్పించాడు. ఈ సినిమాని ఎప్పటికీ మర్చిపోలేము. అంత చక్కగా నటించాడు బాలయ్య. భైరవద్వీపం సినిమాకి సంబంధించిన స్టిల్స్ .. వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి .


బాలయ్య లా ఎవ్వడు చేయలేడు అని.. కొందరు ఎన్ని జన్మలెత్తినా సరే ఆయనకి సరిపోరని .. బాగా గట్టిగా నందమూరి ఫ్యాన్స్ డైలాగులు పెలుస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో నందమూరి వర్సెస్ ధనుష్ ఫ్యాన్స్ మధ్య వార్  హీట్ పెంచేసింది . ధనుష్ బాగా యాక్టింగ్ చేశాడు ఆయనని పొగుడుకుంటే సరిపోయేది పక్క హీరోలతో కంప్యారిజన్  చేస్తూ ధనుష్ ఫ్యాన్స్ మాట్లాడడమే ఇప్పుడు పెద్ద తలనొప్పి క్రియేట్ చేసేలా మారిపోయింది . దీంతో బాలయ్య ఫ్యాన్స్ కూడా రంగంలోకి దిగి .. బాలయ్య నటించిన సినిమాకి సంబంధించిన పిక్స్ వైరల్ చేస్తున్నారు ..!






మరింత సమాచారం తెలుసుకోండి: