టాలీవుడ్ లో ఉన్న హ్యాండ్సమ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నవీన్ చంద్ర ఒకరు. హీరోగానే కాకుండా విలన్ గా, సహాయక నటుడుగా కూడా సత్తా చాటుతున్న నవీన్ చంద్ర.. ఇటీవల కాలంలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ గా మారిపోయాడు. రీసెంట్ గా `ది బ్లైండ్ స్పాట్`, `ఎలెవెన్` మూవీతో ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇప్పుడు `షో టైం` అంటూ మరో చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించిన‌ ఈ చిత్రం జూలై 4న థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది.
ఈ సంగతి పక్కన పెడితే నవీన్ చంద్ర వైఫ్ ను ఎప్పుడైనా చూశారా..? చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆమె కూడా ఇండస్ట్రీకి చెందిన వ్య‌క్తే. నవీన్ చంద్ర భార్య పేరు ఓర్మా. ఐదేళ్ల క్రితం వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఒక కుమారుడు కూడా జ‌న్మించాడు. ఓర్మా సినిమా ఇండస్ట్రీకి చెందినవారే. మలయాళం సినీ పరిశ్రమలో డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఆమె కొన్నాళ్లు పని చేశారు.
ప్రముఖ దర్శకుడు సిద్ధిఖ్ గారి దగ్గర కూడా ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో ఓర్మా వ‌ర్క్ చేసింది. ఆ అనుభ‌వంతోనే న‌వీన్ చంద్ర ద‌గ్గ‌ర‌కు వ‌చ్చే క‌థ‌ల‌న్ని ఓర్మా విని జడ్జ్ కూడా చేస్తుందట. అన్ని కుదిరితే ఫ్యూచ‌ర్ లో త‌న భార్య డైరెక్ట‌ర్ గా మారి సినిమా తీసే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని గ‌తంలో ఓ ఇంట‌ర్వ్యూలో న‌వీన్ చంద్ర చెప్పుకొచ్చాడు. కాగా, ఓర్మా ఇండ‌స్ట్రీకి చెందిన వారే అయిన బ‌ట‌య పెద్ద‌గా క‌నిపించారు. సింపుల్ లైఫ్ ను ఆమె లీడ్ చేస్తుంటారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: