
దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఈ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి . మురుగదాసు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అప్పట్లో పూర్తిస్థాయి అంచనాలను అందుకోలేకపోయింది . చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ సరికొత్త ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కింది . ఫ్యాన్స్ కి మంచి కిక్కించే మాస్ ఎలిమెంట్స్ స్టాలిన్ లో ఉన్నాయి..కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం పెద్దగా రిజల్ట్ చూపించలేకపోయింది. చిరు ఇంట్రో.. ఇంటర్వెల్.. ప్రదీప్ రావత్ కి వార్నింగ్ ఇచ్చే సీన్ కొన్ని కొన్ని చాలా హైలెట్ గా మారాయి . అయితే ఈ సినిమా ఇప్పుడు ఆగస్టు 22వ తేదీ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా మళ్ళీ రీ రిలీజ్ కాబోతుంది .
ఇదంతా ఓకే కానీ ఫ్యాన్స్ ఒక విషయంలో మాత్రం ఫుల్ డిసప్పాయింట్ అయిపోయారు. విశ్వంభర అప్డేట్స్ అడిగితే స్టాలిన్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్నారు ఏంటి..?? అంటూ మండిపడుతున్నారు. ఈ సంవత్సరం మెగా ఫాంటసీ మూవీ వస్తుందా..?? రాదా..?? అని అనుమానం మరింత ఎక్కువైపోయాయి. వి ఎఫ్ ఎక్స్ గురించి వార్తలు విని విని విసుగు వచ్చేసింది అని.. వి ఎఫ్ ఎక్స్ కారణంగానే లేట్ అవుతుంది అనే సాకులు చెప్పద్దు అని మేకర్స్ పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు . సరిగ్గా గత ఏడాది చిరంజీవి పుట్టినరోజు రోజున టీజర్ వచ్చింది. ఆ తర్వాత నుంచి సరైన అప్డేట్ లేదు అంటూ మండిపడిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో సినిమాకి ఇలాంటి దుస్థితా అంటూ ఫైర్ అయిపోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అభిమానులను మోసం చేస్తున్నారా..?? అంటూ కొంతమంది జనాలు ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. సినిమా అసలు ఎప్పుడు రిలీజ్ చేస్తారో..?? స్పష్టంగా చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో స్టాలిన్ వర్సెస్ విశ్వంభర అనే హ్యాష్ ట్యాగ్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయ్..!!