
అంతేకాదు అల్లు అర్జున్ ఇప్పుడు అట్లీతో సినిమా చేస్తున్నాడు . ఆల్రెడీ ఈ మూవీ సెట్స్ పై కి వచ్చేసింది. ఈ సినిమాలో హీరోయిన్గా దీపికా పదుకొనే నటిస్తుంది . ఇది చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న మూవీ అంటూ ఓ న్యూస్ బయటకు వచ్చింది . రిలీజ్ అయిన కొన్ని పిక్స్ .. లీకైన కొన్ని న్యూస్ .. అదే విధంగా అల్లు అర్జున్ ని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తుంది. కాగా రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక కీలక న్యూస్ బయటకు వచ్చింది . సోషల్ మీడియాలో ఈ న్యూస్ లీకై వైరల్ గా మారింది .
హీరో అల్లు అర్జున్ ని ఈ సినిమాలో విలన్స్ చంపడానికి ప్లాన్ చేస్తారట. అలా ఇలా కాదు ఫుల్ హై యాక్షన్ తో ఈ సీన్స్ రాసుకున్నారట అట్లీ . అంతేకాదు బన్నీని సుపారీ ఇచ్చి చంపించడానికి విలన్స్ ట్రై చేస్తున్న మూమెంట్లో అల్లు అర్జున్ అదే విధంగా విలన్స్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా ఉండబోతాయట . ప్రతి ఒక్క బన్నీ ఫ్యాన్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఈ సీన్స్ రాశాడు అట్లీ అంటూ కోలీవుడ్ ఇండస్ట్రీలో న్యూస్ బయటకు వచ్చింది . ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ ట్రెండ్ అవుతుంది. చిత్ర బృందం దీని గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతూ ఉండడంతో బన్నీ ఫ్యాన్స్ సినిమా గురించి ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు..!!