అదృష్టం అంటే నయన తారాదే . అదృష్టం ఆమె వెంట పడుతుందా..? ఆమె అదృష్టం వెంట పడుతుందా..? అర్థం కావడం లేదు. పట్టిందల్లా సరే బంగారంలా మారిపోతుంది.  ఆమె ఏ ప్రాజెక్టు చూస్ చేసుకున్న అది సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది. సూపర్ సక్సెస్ అవుతూ నయన్ పేరు మరింత మారుమ్రోగిపోయేలా చేస్తుంది. అఫ్కోర్స్ ఈ మధ్యకాలంలో పలు కాంట్రవర్షియల్ మ్యాటర్స్ లో ఇరుక్కున్న నయన్.. ఒక్కొక్కటిగా ఆ నెగిటివిటి మొత్తం పాజిటివిటీగా స్ప్రెడ్ చేసుకుంటుంది . ఇప్పుడు నయనతార మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కే కాంబో సినిమాలో నటిస్తుంది.

సినిమా ఇంకా రిలీజ్ కాలేదు . అప్పుడే మరోక తెలుగు బడా సినిమాకి సైన్ చేసినట్లు ఫిలిం సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి . టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది సీనియర్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న వెంకటేష్ సరసన నయనతార నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తుంది. అది కూడా క్రేజీ క్రేజీ క్రేజీ ప్రాజెక్టులో.. త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో వెంకటేష్ ఓ సినిమాలో నటించబోతున్నాడు . ఈ విషయం అందరికీ తెలిసిందే . స్క్రిప్ట్ కూడా పూర్తి అయిపోయింది. ఇది పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారను చూస్ చేసుకున్నారు త్రివిక్రమ్ శ్రీనివాసరావు అంటూ ఓ న్యూస్ తెర పైకి వచ్చింది.  ఆల్రెడీ వెంకటేష్ - నయనతారల కాంబో హిట్ అంటూ ప్రూవ్ చేసుకుంది.  కొత్త కాంబోని సెట్ చేసి రిస్క్ చేసే బదులు ఉన్న కాంబో  రిపీట్ చేస్తే బెటర్ అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస రావు ఈ డెసీషన్ తీసుకున్నారట. పైగా హిట్ కాంబో..ఇక మేకర్స్ కూడా నయన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.  వెంకటేష్ కూడా అందుకు ఓకే చెప్పారట . దీంతో వీళ్ల కాంబో ఫైనలైజ్ అయిపోయింది . త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమా ఈ నెలలోనే సెట్స్ పై కి వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఓ న్యూస్ సినీ వర్గాలల్లో వైరల్ గా మారింది..!!


మరింత సమాచారం తెలుసుకోండి: