పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిది అగర్వాల్ హీరోయిన్గా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఏ ఏం రత్నం అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ ని జులై 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. కొంత కాలం క్రితం రత్నం మాట్లాడుతూ ... ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయే రేంజ్ లో ఉండబోతుంది. మూవీ ట్రైలర్ వచ్చాక సినిమాపై సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు మారిపోతాయి అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే నిన్న ఉదయం ఈ మూవీ కి సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు.

దాదాపు మూడు నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ ట్రైలర్లో పవన్ లుక్స్ , నిధి అగర్వాల్ గ్లామర్ అద్భుతమైన స్థాయిలో నిలిచాయి. మొత్తంగా ఈ సినిమా ట్రైలర్ ఈ మూవీ పై అంచనాలు పెంచే విధంగానే ఉంది అని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్ గురించి చిరంజీవి , రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హరిహర వీరమల్లు మూవీ ట్రైలర్ ఎంతో ఉత్తేజంగా ఉందని , ఈ మూవీ కి థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయం అని చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించాడు. ఇక చరణ్ ఈ మూవీ ట్రైలర్ పై స్పందిస్తూ ... ట్రైలర్ చూస్తూనే మూవీ ఎలా ఉంటుందో అర్థం అవుతుంది.

స్క్రీన్ పై పవన్ మంచి ట్రీట్ ఇవ్వబోతున్నారు. మూవీ యూనిట్ కి ఆల్ ది బెస్ట్ అంటూ చరణ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశాడు. తాజాగా ఈ ఇద్దరు హరిహర వీరమల్లు గురించి చేసిన పోస్ట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే పవన్ అభిమానులు హరిహర వీరమల్లు సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకుంటుంది అని గట్టి ఆశ భావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: