అక్కినేని నాగార్జున హీరోయిన్లతో ఎలాంటి వివాదాలు, గొడవలు పెట్టుకోరు.అలాంటిది ఫర్ ది ఫస్ట్ టైం ఓ హీరోయిన్ తో గొడవపడి ఇప్పటికి కూడా మాట్లాడడం లేదట. మరి ఇంతకీ నాగార్జునతో గొడవ పెట్టుకున్న ఆ హీరోయిన్ ఎవరు..వీరి మధ్య ఎందుకు మాటలు లేవు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. లేడీ అమితాబ్ అనగానే అందరికీ విజయశాంతి పేరే గుర్తుకొస్తుంది. అయితే అలాంటి ఈ హీరోయిన్ లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనే కాకుండా చాలామంది హీరోలతో పదికి పైగా సినిమాల్లో నటించింది. అలా చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలతో ఎన్ని సినిమాల్లో నటించిందో చెప్పనక్కర్లేదు. ఇక ఆ తరం హీరోలు అయినటువంటి వెంకటేష్, నాగార్జునతో కూడా విజయశాంతి ఆడిపాడింది. అయితే వెంకటేష్ తో విజయశాంతి అనుబంధం బాగానే ఉన్నప్పటికీ నాగార్జునతో మాత్రం విజయశాంతికి గొడవలు ఉన్నాయట.. 

నాగార్జున, విజయశాంతి మధ్య ఉన్న గొడవలు చాలా రోజుల నుండి కొనసాగుతున్నాయి.ఇప్పటికి కూడా వీరి మధ్య మాటల్లేవని తెలుస్తోంది. మరి ఇంతకీ వీరిద్దరి మధ్య గొడవలు రావడానికి కారణం ఏంటి అనేది చూస్తే.. విజయశాంతి నాగార్జున కాంబోలో మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాలు కూడా పర్వాలేదు అనిపించాయి. అయితే వీరిద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు హిట్ అవ్వడంతో నాలుగో సినిమాని కూడా తీసుకురావాలనుకున్నారు మేకర్స్.అలా ఆ నాలుగో సినిమాలో నాగార్జున కెప్టెన్ గా.. విజయశాంతి సిబిఐ ఆఫీసర్ గా.. కనిపిస్తున్నట్టు వీరిద్దరి పాత్రలు కూడా చెప్పారట. అయితే మొదట ఈ సినిమాకి ఓకే చెప్పిన నాగార్జున పూజా కార్యక్రమాలతో సినిమా ఫస్ట్ డే షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మధ్యాహ్నం వరకే సినిమా ఆగిపోయిందట  

దానికి కారణం ఈ సినిమా స్క్రిప్ట్ చదివిన నాగార్జున నాకంటే హీరోయిన్ కి డైలాగులు ఎలా ఎక్కువ ఉంటాయి. హీరోకే అధిక ప్రాధాన్యత ఉండాలి. కానీ హీరోయిన్ ని నాకంటే ఎక్కువ చేసి చూపిస్తే నా స్టార్డం ఏమవుతుంది అని షూటింగ్లోనే గొడవ పెట్టుకున్నారట. అయితే మగాళ్ళ అనుచివేతని తట్టుకోలేని విజయశాంతి ఎప్పుడు హీరోకే ప్రాధాన్యత ఉండాలా..హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండకూడదా అని నాగార్జునతో గొడవ పెట్టుకుందట.అలా వీరిద్దరి మధ్య ఆరోజు గొడవ బాగానే జరిగినట్టు ఆ మధ్య కాలంలో టాక్ వినిపించింది.దాంతో ఈ సినిమా షూటింగ్ మొదలైన మొదటి రోజే ఆగిపోయింది. అయితే ఆ సినిమా షూటింగ్ టైంలో జరిగిన గొడవ ఇప్పటికీ కొనసాగుతూనే ఉందట. అందుకే విజయశాంతికి,నాగార్జునకి మధ్య మాటలు కూడా లేవని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: