ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన పటాస్ మూవీ తో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈయన పటాస్ మూవీ కంటే ముందు చాలా సినిమాలకు రైటర్ గా పని చేశాడు. ఈయన రైటర్ గా పని చేసిన సినిమాల్లో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను సాధిస్తే మరికొన్ని సినిమాలు మాత్రం బాక్సా ఫీస్ దగ్గర అపజయలను అందుకున్నాయి. కొంత కాలం క్రితం అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

అందులో భాగంగా అనిల్ రావిపూడి , మహేష్ నటించిన ఆగడు సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను తెలియజేశాడు. ఓ ఇంటర్వ్యూ లో భాగంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ ... నేను మహేష్ బాబు హీరో గా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన ఆగడు సినిమా ఫస్టాఫ్ కి రైటర్ గా పని చేశాను. నేను ఆ సినిమా సమయంలో పటాస్ మూవీ ని మొదలు పెట్టాను. దానితో నేను ఆ సినిమా సెకండ్ హాఫ్ కు రైటర్ గా పని చేయలేక పోయాను. ఆగడు మూవీ ఫస్ట్ అఫ్ మొత్తం కంప్లీట్ అయ్యాక ఆ సినిమా సెకండ్ హాఫ్ విషయంలో నేను ఒక పాయింట్ అనుకున్నాను. పటాస్ సినిమాలో ఫస్టఫ్ ఫన్నీగా ఉన్నా సెకండ్ హాఫ్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. నేను ఆగడు సినిమాకు కూడా ఫస్టఫ్ ఫన్నీగా ఉన్న సెకండాఫ్ ఎమోషనల్ ఫెలో వెళితే బాగుంటుంది అని చెబుదాము అనుకున్నాను.

కానీ అప్పటికే వారు ఆగడు సినిమా సెకండాఫ్ ను కూడా మొదలు పెట్టి కొంత భాగం పూర్తి చేశారు. అలాంటి సమయంలో నా ఆలోచన చెబితే బాగోదు అనే ఉద్దేశంతో నేను ఆ ఆలోచనను శ్రీను వైట్ల గారికి చెప్పలేదు. ఒక వేళ నా ఆలోచనను నేను ఆ రోజే శ్రేణు వైట్లvకు చెప్పి ఉండుంటే ఆ మూవీ మంచి విజయం సాధించేదేమో అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: