సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన నటీ నటుల విడాకులపై అనేక రూమర్స్ పుట్టుకు రావడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన సెలబ్రిటీ దంపతులు ఏ కాస్త దూరంగా ఉన్నా కూడా వారు విడిపోబోతున్నారు అని , అందుకే వారు దూరంగా ఉంటున్నారు అని కథనాలు వైరల్ కావడం కూడా మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. ఇకపోతే కొంత మంది వెంటనే వీటి గురించి స్పందించి దానిపై క్లారిటీ ఇస్తూ ఉంటారు. మరి కొంత మంది వాటిపై డైరెక్ట్ గా స్పందించకుండా ఇన్ డైరెక్ట్ గా అలాంటి వార్తలకు పుల్ స్టాప్ పెడుతూ ఉంటారు. ఇండియా వ్యాప్తంగా అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నటీ మణులలో నయనతార ఒకరు.

ఈమె కొన్ని సంవత్సరాల క్రితం నటుడు మరియు దర్శకుడు అయినటువంటి విగ్నేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. వీరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు. వీరి సంసార జీవితం ప్రస్తుతం ఎంతో సంతోషంగా ముందుకు సాగుతుంది. గత కొన్ని రోజుల క్రితం నయన తార తన సోషల్ మీడియా అకౌంట్లో పెళ్లి గురించి , వివాహ బంధం గురించి నెగటివ్గా పోస్ట్ చేసింది అని , ఆ తర్వాత చాలా తక్కువ సమయం లోనే దానిని డిలీట్ చేసింది అని , దానితో నయన్ , విగ్నేష్ మధ్య ప్రస్తుతం విభేదాలు వచ్చాయి అని , వారు విడిపోబోతున్నారు అని అనేక కథనాలు బయటికి వచ్చాయి.

ఇటిపై నయన తార గాని విగ్నేష్ గాని డైరెక్ట్ గా స్పందించలేదు. తాజాగా నయన తార , విగ్నేష్ ఇద్దరు కూడా తమ ఇద్దరు పిల్లలతో కలిసి పళని ఆలయానికి వెళ్లారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనితో నయన్ , విగ్నేష్ తమ విడాకులపై వస్తున్న వార్తలకు ఇన్ డైరెక్ట్ గా పుల్ స్టాప్ పెట్టేసారు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: