
అలాగే ఈ సినిమాతో పాటు దర్శకుడు సుకుమార్ తో కూడా మరో సినిమా చేయబోతున్నారు . రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ కాంబో .. ఇప్పుడు మరోసారి రిపీట్ కావడంతో సినిమా పై అంచనాలు మరో లెవల్ కు వెళ్లాయి .. అయితే ఇప్పుడు తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఒక క్రేజీ న్యూస్ అయితే వినిపిస్తుంది .. ఈ సినిమాలో కన్నడ బ్యూటీ ని హీరోయిన్గా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ మరెవరో కాదు .. రుక్మిణి వసంత్ .. సప్త సాగరాలు దాటి సినిమాతో సౌత్ లో భారీ క్రేజ్ తెచ్చుకుంది .. ఈ సినిమా తర్వాత రుక్నిణికి టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయి .. ప్రస్తుతం ఈ బ్యూటీ ప్రశాంత్ నిల్ , ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది .
అలాగే ఇప్పుడు దర్శకుడు సుకుమార్ , రామ్ చరణ్ కాంబోలో రానున్న సినిమాలో కూడా రుక్మిణిని కన్ఫామ్ చేసినట్టు సమాచారం .. అయితే ఇందులో ఎంతవరకు నిజముంది అనేది మాత్రం తెలియాల్సి ఉంది .. ఇక ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు .. చరణ్ పెద్ది తర్వాత చేయబోయే ఈ మూవీ పై ఇప్పటికే అంచనాలు బాగా ఉన్నాయి . ఇక సప్త సాగరాలు దాటి సినిమా తర్వాత రుక్మిణి వసంత్ కు తెలుగులో భారీ క్రేజ్ వచ్చింది .. ఈ సినిమాలో అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది .. ప్రస్తుతం ఎన్టీఆర్ కు జంటగా నటిస్తున్న రుక్మిణి .. ఇప్పుడు చరణ్ సుకుమార్ కాంబోలో రాబోతున్న సినిమాలో కూడా నటించబోతుంది ..